తెలుగు ప్రజలకు వైఎస్ విజయమ్మ క్రిస్మస్ శుభాకాంక్షలు

By Nagaraju TFirst Published Dec 24, 2018, 11:15 AM IST
Highlights

క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలకు తెలిపారు. కడప జిల్లా ఇడుపుల పాయలోని దివంగతనేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద విజయమ్మ శ్రద్ధాంజలి ఘటించారు. 

కడప: క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలకు తెలిపారు. కడప జిల్లా ఇడుపుల పాయలోని దివంగతనేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద విజయమ్మ శ్రద్ధాంజలి ఘటించారు. 

అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్ బ్రతికి ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో క్రిస్మస్ కు ముందు రోజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే వైఎస్ మరణానంతరం కూడా కుటుంబ సభ్యులు ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. 

వైఎస్ జగన్ పాదయాత్రలో ఉండటంతో వైఎస్ విజయమ్మ మరియు ఇతర కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు వైఎస్ విజయమ్మ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌ అంటే శాంతికి చిహ్నం అని, అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా కలిలిమెలసి ఉండాలని కోరారు. 

click me!