విశాఖలో కేసీఆర్ ఫ్యాన్స్ కు మిగిలింది నిరాశే

By pratap reddyFirst Published Dec 24, 2018, 7:23 AM IST
Highlights

కేసీఆర్ మద్దతుదారులు అదివారంనాడు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి చినముసిడివాడ వరకు బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. స్వరూపానందేంద్ర సరస్వతి సూచన మేరకు చినముసిడివాడలోని శ్రీ శారద పీఠాన్ని సందర్శించిన కేసీఆర్ అక్కడ రాజశ్యామల దైవానికి పూజలు చేశారు. 

విశాఖపట్నం:  తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు అభిమానులకు, మద్దతుదారులకు విశాఖపట్నంలో నిరాశే ఎదురైంది. కేసీఆర్ ను కలవాలని ఆయన అభిమానులు, మద్దతుదారులు ప్రయత్నించారు. అయితే, వారిని పోలీసులు అపేశారు. 

కేసీఆర్ మద్దతుదారులు అదివారంనాడు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి చినముసిడివాడ వరకు బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. స్వరూపానందేంద్ర సరస్వతి సూచన మేరకు చినముసిడివాడలోని శ్రీ శారద పీఠాన్ని సందర్శించిన కేసీఆర్ అక్కడ రాజశ్యామల దైవానికి పూజలు చేశారు. 

విశాఖపట్నం విమానాశ్రయంలో కేసీఆర్ మద్దతుదారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దాంతో కేసీఆర్ ను కలిసే అవకాశం వస్తుందని వారు భావించారు. అయితే, కేసీఆర్ కు పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 

శనివారం రాత్రే తెలంగాణ పోలీసులు ఆశ్రమాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. దానివల్ల రాజకీయ పార్టీల నేతలకు మాత్రమే కాకుండా కేసీఆర్ అభిమానులకు కూడా ఆయనను కలిసే అవకాశం కలగలేదు. దాంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కేసిఆర్ కుటుంబ సభ్యులు స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత ఒడిశాకు బయలుదేరి వెళ్లారు. 

click me!