చవ్వా రాజశేఖర్ రెడ్డి కొడుకు పెళ్లికి హాజరైన వైఎస్ విజయమ్మ.. వధూవరులకు ఆశీర్వాదం...

Published : Jun 18, 2022, 09:34 AM IST
చవ్వా రాజశేఖర్ రెడ్డి కొడుకు పెళ్లికి హాజరైన వైఎస్ విజయమ్మ.. వధూవరులకు ఆశీర్వాదం...

సారాంశం

వైఎస్ విజయమ్మ అనంతపురం వచ్చారు. వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు చవ్వా రాజశేఖర్ రెడ్డి కొడుకు పెళ్లికి ఆమె హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. 

అనంతపురం :  వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు చవ్వా రాజశేఖర్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలకు వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలశ పూజలో పాల్గొని వరుడు అంకిత్ రెడ్డిని దీవించారు. ఆ తర్వాత పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేసి ఆమె వెనుదిరిగారు. అంతకుముందు అనంత కు చేరుకున్న వైయస్ విజయమ్మకు సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, జెడ్పి చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎస్వీవీయూ పాలక మండలి సభ్యురాలు తోపుదుర్తి నయనతార రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ రాగే హరిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎం ఉమ, వైఎస్ఆర్సిపి నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి, గౌస్ బేగ్, ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, శ్రీదేవి, విద్యాసాగర్ రెడ్డి, అనిల్ కుమార్ గౌడ్, కొర్రపాడు  హుస్సేన్ పీరా పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!