ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్‌గా ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు ఈ శాఖ మీద ఎలాంట అవగాహన లేదని చెప్పుకొచ్చారు.
అమరావతి : ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్‌గా మూడేళ్ల అనంతరం తిరిగి బాధ్యతలు స్వీకరించానని, అయితే తనకు ఈ శాఖ పట్ల పూర్తి అవగాహన లేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముత్యాలంపాడులోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌కు గతంలో కీర్తి ఉండేదని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రింటింగ్ విభాగం ఆదరణ పొందుతూ వచ్చిందన్నారు. విభజన తరువాత మిగిలిన ఈ విభాగంలోని స్థితి గతులను అధ్యానం చేస్తానన్నారు.
గతంలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు సయితం ఇక్కడ ప్రింటింగ్ అయ్యేవని, ప్రస్తుతం ఇక్కడ కార్యకలాపాలపై సిబ్బందితో చర్చించి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రాధాన్యత లేని పోస్టింగ్‌గా తాను భావించడంలేదన్నారు. నియామకాల విషయంలో ప్రభుత్వం తన ఆలోచనల మేరకు చేస్తుందన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు కార్యాలయాన్ని పరిశీలించారు.
ఫలించిన ఎదురుచూపులు .. ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చిన జగన్ సర్కార్
ఇదిలా ఉండగా, సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు నిరీక్షణ ఫలించింది. ఆయనకు ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఏబీ వెంకటేశ్వరరావును ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్‌గా నియమిస్తూ జూన్ 15, బుధవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టింగ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఏబీవీకి ఈ నిర్ణయంతో ఊరట కలిగినట్లయ్యింది.
కాగా.. నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఏబీ వెంకటేశ్వరరావును వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. అయితే, ఇజ్రాయిల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలులో అయితే ఇజ్రాయిల్ నుండి నిఘా పరికరాల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలు ఉల్లంఘించారని జగన్ సర్కార్ ఆయన మీద కేసు నమోదు చేసింది. అంతేకాదు ఆయనను సస్పెండ్ చేసింది.
తనపై విధించిన సస్పెన్షన్ ముగిసిందని ఏబీ వెంకటేశ్వరరావు ఈ ఏడాది మార్చి 25న ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కూడా లేఖ రాశారు. 2021 జూలైలో తన మీద విధించిన సస్పెన్షన్ ను చివరిసారిగా పొడిగించిన విషయాన్ని వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. తన మీద విధించిన సస్పెన్షన్ కు సంబంధించిన జీవోలను రహస్యంగా ఉంచారని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ తనకు కూడా కాపీ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఎలా చూసినా కూడా తన సస్పెన్షన్ ముగిసిందని ఆయన తేల్చి చెప్పారు.
ఆయన ఈ లేఖ రాసిన తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పెగాసెస్ అంశం మీద చర్చ జరిగింది. ఈ విషయం మీద హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు కూడా స్పందించారు. కూడా 2019 మే వరకు పెగాసెస్ సహా ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు.