నాంపల్లి కోర్టుకు హాజరు కానున్న వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల

Published : Nov 10, 2020, 10:08 AM IST
నాంపల్లి కోర్టుకు హాజరు కానున్న వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల

సారాంశం

ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో నేడు నాంపల్లి కోర్టులో వైఎస్ విజయలక్ష్మి,  వైఎస్ షర్మిల  హాజరుకానున్నారు.   

ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో నేడు నాంపల్లి కోర్టులో వైఎస్ విజయలక్ష్మి,  వైఎస్ షర్మిల  హాజరుకానున్నారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి, సోదరి వైఎస్ షర్మిల ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఇందుకుగాను నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో నేడు నాంపల్లి కోర్టుకి ఇద్దరూ హాజరుకానున్నారు. 

2012లో పరకాల ఉపఎన్నికల సమయంలో ఎలాంటి అనుమతి తీసుకోకుండా.. నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ విజయలక్ష్మి, షర్మిల రోడ్డు షో నిర్వహించారు. దీంతో ఆ ఇద్దరితో పాటు అప్పట్లో మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండ మురళిపై కూడా కేసు నమోదయ్యింది. 

ఈ కేసులో నలుగురు కచ్చితంగా విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఈ నలుగురూ కోర్టుకు హాజరుకాబోతున్నారు.

PREV
click me!

Recommended Stories

ప్ర‌ధాని మోదీతో గంట‌న్న‌ర స‌మావేశ‌మైన సీఎం చంద్ర‌బాబు.. ఏం మాట్లాడ‌రంటే.?
Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం