వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల కర్నాటక నుంచి రాజ్యసభలో అడుగుపెడతారని సమాచారం.
హైదరాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కాంగ్రెస్‌లో చేరిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కర్నాటక నుంచి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది.
తనను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతామని, పార్టీ ప్రధాన కార్యదర్శిని చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని షర్మిల సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజగోపాల్ కొన్ని మీడియా సంస్థలతో షర్మిల తనకు ఈ సమాచారం ఇచ్చారని తెలిపినట్లు వినిపిస్తోంది.
undefined
వైసీపీలో మూడో లిస్ట్ టెన్షన్.. తాడేపల్లికి నేతల క్యూ.. రాజీనామాల బాటలో టికెట్ రాని నేతలు !
మరోవైపు వైఎస్ షర్మిల మాత్రం రాజ్యసభ సభ్యత్వమా, మరేదైనా బాధ్యతనా అనేది జనవరి 8న నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీ అండమాన్ కు వెళ్లమన్నా వెళ్లి బాధ్యతలు నిర్వహిస్తానని తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ లో తనకు ఏ బాధ్యతలు అప్పగిస్తారో తేలిపోతుందన్నారు.
కాగా, వైఎస్ షర్మిల జనవరి 4న ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.