కోల్డ్ వార్ ఉండేది.. వివేకా హత్యకు రాజకీయపరమైన కారణాలు!: వైఎస్ షర్మిల వాంగ్మూలంలో కీలక వ్యాఖ్యలు

By Mahesh K  |  First Published Jul 21, 2023, 4:11 PM IST

వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ సోదరి, వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల సీబీఐకి గతేడాది అక్టోబర్‌లో ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబంలో కోల్డ్ వార్ జరుగుతూ ఉండేదని, వివేకా ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి అవినాశ్, భాస్కరరెడ్డి, మరికొందరు సన్నిహితులే కారణమై ఉంటారని ఆమె ఆరోపణలు చేశారు.
 


హైదరాబాద్: వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన సీబీఐకి ఇచ్చిన తన వాంగ్మూలంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇచ్చిన ఈ వాంగ్మూలంలో వైఎస్ వివేకా హత్య ఆర్థిక కారణాలతో కాదు, రాజకీయ కారణాలతో జరిగిందని పేర్కొన్నారు. తన వద్ద ఆధారాలు లేవని, కానీ, రాజకీయ కారణాలతోనే వివేకా హత్య జరిగినట్టు తాను నమ్ముతున్నానని వివరించారు. అవినాశ్ రెడ్డి కుటుంబానికి వివేకా వ్యతిరేకంగా నిలబడ్డారని, వారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకుని ఉండొచ్చేమో అని పేర్కొన్నారు. 259వ సాక్షిగా ఆమె వాంగ్మూలాన్ని కోర్టుకు సీబీఐ అందించింది.

వివేకా హత్యకు గురికావడానికి ముందు బెంగళూరులోని తమ ఇంటికి ఆయన వచ్చారని షర్మిల తన వాంగ్మూలంలో చెప్పారు. తనను కడప ఎంపీగా పోటీ చేయాలని కోరారని వివరించారు. ఎంపీగా అవినాశ్ రెడ్డి పోటీ చేయవద్దని కోరుకుంటున్నట్టు తనకు తెలిపారని చెప్పారు. అవినాశ్‌కు టికెట్ ఇవ్వకుండా జగన్‌ను కన్విన్స్ చేయాలని తనను కోరారని వివరించారు. బాగా ఒత్తిడి చేయడంతో తాను ఎంపీగా పోటీ చేయ డానికి సరేనని చెప్పట్టు పేర్కొన్నారు. అయితే, స్వయంగా వివేకాను పోటీ చేయవచ్చు కదా? షర్మిలను ఒత్తిడి చేయడమెందుకు అని సీబీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్సీగా ఓడిపోయినందున ఆయన ఎంపీ పోటీకి ఆసక్తి చూపలేదేమో అని షర్మిల పేర్కొన్నారు. అదీగాక, ఆయన విజయమ్మపై పోటీ చేశారు కాబట్టి, టికెట్ దక్కే అవకాశాలు ఉండవని భావిం చారని వివరించారు.

Latest Videos

Also Read: సొంతగూటికి ఉమ్మడి నల్గొండ జిల్లా నేత గోపగాని... కాంగ్రెస్‌కు రాజీనామా, త్వరలో BRSలోకి

కుటుంబంలో అంతా బాగున్నట్టు కనిపించినా లోపల అలా లేదని వైఎస్ షర్మిల తన వాంగ్మూలంలో చెప్పారు. లోపల కోల్డ్ వార్ జరిగేదని పేర్కొన్నారు. తనకు తెలిసినంత వరకు ఎమ్మెల్సీగా వివేకానంద ఓటమికి అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మరికొందరు సన్నిహితులే కారణమై ఉంటారని తన నమ్మకం అని షర్మిలా వివరించారు.

click me!