ఉంచుకున్నారు .... వైఎస్ జగన్ ది అక్రమ సంబంధం : వైఎస్ షర్మిల సంచలనం

By Arun Kumar P  |  First Published Jul 13, 2024, 8:42 AM IST

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. తాజాగా వైఎస్ షర్మిల తన సొంత సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేసారు. 


అమరావతి : అన్నాచెల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల మధ్య హాట్ హాట్ రాజకీయాలు సాగుతున్నాయి. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వం కోసం ఈ ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అన్నాచెల్లి మధ్య దూరం పెరిగి రాజకీయ వైరం సాగుతోంది. ఇప్పటికే తండ్రి వైఎస్సార్ పేరిట రాజకీయపార్టీ పెట్టి ప్రజలవద్దకు వెళ్లి ఓసారి అధికారాన్ని కూడా చేపట్టారు జగన్... ఇలా తండ్రిపేరు చెప్పుకుని సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు తండ్రి లెగసీని వాడుకునేందుకు వైఎస్ షర్మిల సిద్దమయ్యారు... అందువల్లే వైఎస్సార్ సిపి కి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సంబంధం లేదంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇలా అన్నాచెల్లి మధ్య తండ్రి రాజకీయ వారసత్వం కోసం పోరు సాగుతోంది. 

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న షర్మిల తండ్రి వైఎస్సార్ ఈ పార్టీకి చెందినవారుగా పేర్కొంటున్నారు. తన తండ్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా బిజెపికి వ్యతిరేకంగా పనిచేసారని గుర్తుచేసారు. అలాంటి బిజెపితో అంటకాగిన వైసిపి వైఎస్సార్ తమ నాయకుడని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నిస్తున్నారు. పచ్చిగా చెప్పాలంటే వైసిపిని బిజెపి ఉంచుకుందని... ఈ రెండు పార్టీలకు అక్రమ సంబంధం వుందని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇలాంటి పార్టీతో దివంగత వైఎస్సార్ కు ఎలాంటి సంబంధం లేదు... అప్పుడూ, ఇప్పుడు, ఎప్పుడూ ఆయన కాంగ్రెస్ నాయకుడేనని షర్మిల స్పష్టం చేసారు.  

Latest Videos

వైఎస్సార్ విగ్రహాలపై దాడులొద్దు..: 

తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ఏర్పాటుతర్వాత జరుగుతున్న వైస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల ధ్వంసంపై షర్మిల సీరియన్ అయ్యారు. అసలు వైసిపికి వైఎస్సార్ కు ఏ సంబంధము లేదు... అలాంటిది ఆయన విగ్రహాల విగ్రహాలను ధ్వంసమెందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలా వైఎస్సార్ విగ్రహాలపై జరుగుతున్న దాడిని ఆమె ఖండించారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల మనిషి... ఆయనకు రాజకీయాలు ఎందుకు ఆపాదిస్తున్నారు? అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్సార్ ఏనాడు వైసిపి పార్టీలో లేడు...  ఆ పార్టీ నాయకుడు కాదన్నారు. అసలు వైసిపి అంటే వైఎస్సార్ కాంగ్రెస్ కాదు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. వైఎస్సార్ ఆశయాలను సాధించడం వైసిపితో సాధ్యం కాదన్నారు. నిజంగానే వైఎస్సార్ ఆశయసాధనకే వైసిపి పనిచేస్తుంటే ఆయన కలల ప్రాజెక్ట్ జలయజ్ఞం ఎందుకు పూర్తి చేయలేదని షర్మిల ప్రశ్నించారు. 

వైఎస్సార్ పక్కా కాంగ్రెస్ మనిషి... బ్రతికున్నంత కాల కాంగ్రెస్ లోనే వున్నారు... చివరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చనిపోయారని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేసిన ఆయన ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని గుర్తుచేసారు. ఇలా ప్రజాసేవ చేసిన మహోన్నత నాయకుడి విగ్రహాలు ధ్వంసం చేయడం తగదన్నారు. ఇంకోసారి వైఎస్సార్ విగ్రహాల జోలికి వస్తే అస్సలు ఊరుకోం... పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామంటూ షర్మిల హెచ్చరించారు. 

బిజెపికి తోక పార్టీ వైసిపి :

తెలుగు దేశం పార్టీకి కాంగ్రెస్ తోక పార్టీల మారిందంటూ వైసిపి నాయకులు చేస్తున్న విమర్శలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. బిజెపికే వైసిపి తోకపార్టీలా మారిందని...రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిమరీ సహకరించిందన్నారు. బీజేపీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి వైసిపి మద్దతు తెలిపింది... దీన్నిబట్టే ఎవరు ఎవరికి తోకపార్టీనో ప్రజలకు అర్థమయ్యిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికో తోక పార్టీ కాదని నిరూపించాల్సిన అవసరం లేదన్నారు. 

ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు. మిగతా పార్టీలన్ని బిజెపి అనుబంధ పార్టీలే.... కొన్ని సక్రమ పొత్తులయితే ఇంకొన్ని అక్రమ పొత్తులని అన్నారు. బీజేపీ అంటే బాబు,పవన్ ,జగన్ అంటూ కొత్త నిర్వచనం చెప్పారు షర్మిల. 

వైఎస్సార్ ఫోటో పార్టీలో పెట్టుకుంటే సరిపోదు... గుండెల్లో ఉండాలన్నారు షర్మిల. వారి గుండెల్లో వైఎస్సార్ లేరు కాబట్టే ఆయన ఆశయాలను గాలికి వదిలేశారంటూ అన్న జగన్ కు చురకలు అంటించారు. నిజంగా వైఎస్సార్ పై అంత ప్రేమే ఉంటే మొన్న 75వ జయంతిన ఏ కార్యక్రమం చేసారు? ఘాట్ వద్ద 5 నిమిషాలు తూ తూ మంత్రంగా నివాళులు అర్పించారని అన్నారు. వందల కోట్లు సిద్ధం సభలకు ఖర్చు పెట్టారుగా... మరి తండ్రికి నివాళిగా ఒక్క సభ నిర్వహించలేరా? ఏం ఆయన జయంతి ప్రత్యేకం కాదా..? అంటూ అన్నను నిలదీసారు షర్మిల. వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టే తాను పెద్దసభ పెట్టానని షర్మిల తెలిపారు. 

click me!