ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4వేల 151 కిలోమీటర్ల మేర రోడ్లపై పాత్ హోల్స్ (గుంతలు) సమస్య ఉందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2వేల 936 కిలోమీటర్లు మేర ఉన్నాయని తెలిపారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లపై వచ్చినన్ని ట్రోల్స్ అన్నిఇన్ని కాదు. గుంతల మయమైన రోడ్లు వర్షం కురిస్తే చెరువులను తలపిస్తుండటంపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. అయితే, గత ప్రభుత్వం అవేవీ పట్టించుకోలేదు. ఉన్న నిధులు సంక్షేమానికి సరిపోవడం లేదని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాయలసీమ ఎమ్మెల్యేని జనం రోడ్లు బాగు చేయించమని కోరితే.. ఆయన ఇచ్చిన సమాధానానికి అవాక్కైపోయారు. ఒక్క నెల పింఛన్లు తీసుకోవడం మానేస్తే ఎంచక్కా రోడ్లు వేయొచ్చని ఎమ్మెల్యే నోటి నుంచి సమాధానం రావడంతో తిరిగి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి స్థానికుల్లో నెలకొంది. దీనిపై ప్రతిపక్షాలు, మీడియా నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే, ఇప్పుడు ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై దృష్టి పెట్టింది. సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదని, ఫలితంగా వాహనదారులు, ప్రజలు ఐదేళ్ల పాటు నరకం చూశారని అధికారులతో సమావేశంలో ప్రస్తావించారు. ఈ పరిస్థితిని మార్చే పనులు మొదలు కావాలని ఆదేశాలిచ్చారు. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే ప్రక్రియ తక్షణమే ప్రారంభించాలన్నారు.
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి పలు అంశాలను తీసుకొచ్చారు ఆర్ అండ్ బీ అధికారులు.... రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై సీఎంకు వివరించారు. నాడు రోడ్ల మరమ్మతుల కోసం కనీస మొత్తంలో కూడా నిధులు ఖర్చు చేయలేదని తెలిపారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని చెప్పారు. దీంతో కాంట్రాక్టర్లు కూడా నేడు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని వివరించారు.
undefined
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4వేల 151 కిలోమీటర్ల మేర రోడ్లపై పాత్ హోల్స్ (గుంతలు) సమస్య ఉందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2వేల 936 కిలోమీటర్లు మేర ఉన్నాయని తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 7వేల 87 కిలోమీటర్ల మేర ఉన్నాయని... తక్షణమే వాటి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఇందుకోసం కనీసం రూ.300 కోట్ల నిధులు అవసరం అని తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంతలు పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అత్యంవసరంగా బాగు చేయాల్సిన రోడ్లపై దృష్టిపెట్టాలని సూచించారు. వెంటనే టెండర్లు పిలిచి అత్యవసర పనులు చేపట్టాలని ఆదేశించారు.
సాంకేతిక అంశాలపై చర్చ...
రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త, మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై సమీక్షలో చర్చించారు. తిరుపతి ఐఐటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ప్రభుత్వ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో, మన్నిక ఉండేలా రోడ్ల నిర్మాణానికి జరిగిన పరిశోధనల వివరాలను సమీక్షలో సీఎంకు తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో కాకుండా పలు రకాల మెటీరియల్స్ ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేపడితే కలిగే ప్రయోజనాలపై చర్చించారు. నేల తీరు, ట్రాఫిక్ రద్దీ, వర్షాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్నారు. వర్షాకాలంలో కూడా రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టే సాంకేతికపైనా నిపుణులు సాధ్యాసాధ్యాలను వివరించారు.