ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మిల కుమారుడి పెళ్లి రాజస్థాన్ లో శనివారం ఘనంగా (AP Congress chief YS Sharmila's son YS Raja Reddy and Priya Atluri to get married) జరిగింది. అయితే ఈ వేడుకకు మేనమామ వైఎస్ జగన్ హాజరుకాలేదు. తల్లి విజయమ్మ హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి-అట్లూరి ప్రియ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉమేద్ ప్యాలెస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అతి దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వివాహ వేడుక నిర్వహించారు.
కాగా.. వైఎస్ రాజారెడ్డి వివాహానికి మేనమామ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కాలేదు. పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన హల్దీ వేడుకకు సంబంధించిన హల్దీ వేడుకు సంబంధించిన ఫొటోలను వైఎస్ శర్మిల సోషల్ మీడియాలో శనివారం విడుదల చేశారు.
అందులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు. అలాగే ఆయన భార్య, వైఎస్ భారతీ కూడా ఈ వేడుకల్లో కనిపించలేదు. అయితే వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.
ప్రియా అట్లూరి అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. రాజారెడ్డితో ఆమె నిశ్చితార్థం జనవరి 18న హైదరాబాదులోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది. శనివారం వివాహ వేడుక పూర్తి అవ్వగా.. నేడు విందు ఏర్పాటు చేశారు.