మా అన్నయ్య జగన్‌పై కూడా పుకార్లు :షర్మిల

By Arun Kumar PFirst Published Jan 14, 2019, 1:19 PM IST
Highlights

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండతో తెలుగు దేశం శ్రేణులు కేవలం తనపైనే కాదు తన అన్నయ్య, వైఎస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డిపై కూడా అసత్య వార్తలు ప్రచారం చేశారని షర్మిల ఆరోపించారు. తన అన్నయయ్యను ఓ గర్వాస్టిగా, కోపిస్టుగా పేర్కొంటూ పుకార్లు పుట్టించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించారన్నారు. ఇలా  తమ కుటుంబాన్ని తప్పుడు ప్రచారాలతో బాధపెట్టారని....కేవలం తమనే కాదు తమ అభిమానులు, వైఎస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలను బాధ పెట్టారని షర్మిల ఆవేధన వ్యక్తం చేశారు. 

ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్న దోషులను కఠినంగా శిక్షించాలని తాము పోలీస్ కమీషనర్ ని కోరినట్లు షర్మిల తెలిపారు. మహిళలందరి ఆత్మగౌరవాన్ని పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. తమ పిర్యాదుపై సానుకూలంగా స్పందించిన కమీషనర్ ఈ వ్యవహారంతో సంబంధమున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు. 

ఆంధ్ర ప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేకే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షర్మిల స్పష్టం చేశారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పయినా సరే దాన్నే నిజంలా చూపించాలన్నది చంద్రబాబు నైజమని...దాన్నే టీడీపీ నాయకులు అనుసరిస్తారని షర్మిల పేర్కొన్నారు. 

గతంలో తమ నాన్న రాజశేఖర్ రెడ్డి ఓ ప్యాక్షనిస్టు  అంటూ ప్రచారం చేసి రాజకీయంగా దెబ్బతీయాలని చూశారని షర్మిల  గుర్తు చేశారు. అయితే ఆయన సీఎం  అయ్యాక ఎంత గొప్ప వ్యక్తో అందరికి తెలిసిందన్నారు. ఇప్పుడు కూడా మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ద్వారా ఆయనేంటో ప్రజలకు తెలిసిందని షర్మిల అన్నారు. తెలగు  దేశం పార్టీ ఎన్ని ప్రచారాలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు. 

సంబధిత వార్తలు

నా క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!

నాపై దుష్ప్రచారం చేయిస్తుంది చంద్రబాబే: షర్మిల

click me!