జగన్ పాదయాత్ర@3000 కి.మీ... గిన్నిస్‌బుక్‌లో స్థానం

By sivanagaprasad kodatiFirst Published Sep 24, 2018, 11:11 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరుదైన మైలురాయిని అందుకున్నారు. ఆయన నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర ఇవాళ్టీకి 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరుదైన మైలురాయిని అందుకున్నారు. ఆయన నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర ఇవాళ్టీకి 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. 269వ రోజు పాదయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, వారితో మమేకం అయ్యేందుకు 2017 నవంబర్ 6న కడప జిల్లాలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మారక స్థలం నుంచి జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. కడప జిల్లా నుంచి ప్రారంభమైన ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది. మరోవైపు ఈ అరుదైన మైలురాయి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కబోతోంది. 

click me!
Last Updated Sep 24, 2018, 11:11 AM IST
click me!