YS Jagan Kadapa Tour: రేపు, ఎల్లుండి కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే..

By Sumanth KanukulaFirst Published Jul 6, 2022, 11:01 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 7,8 తేదీల్లో కడప జిల్లా పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 8వ తేదీన దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా.. వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్ నివాళులు అర్పించి, ప్రార్థనల్లో పాల్గొంటారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 7,8 తేదీల్లో కడప జిల్లా పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. రేపు ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. ఉదయం 9.20 గంటలకు గన్నవరం విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడి నుంచి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పులివెందులలోని బాకరాపురం హెలీప్యాడ్‌కు వెళతారు.  అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. 

అక్కడ పలువురు ప్రజాప్రతినిధులతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. అలాగే పులివెందుల, వేంపల్లి‌లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సీఎం జగన్ ఇడుపాలయకు చేరుకుంటారు. ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు. 

ఈ నెల 8వ తేదీ ఉదయం 8 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి.. వైఎస్సార్ ఘాట్ చేరుకంటారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా.. ఘాట్ వద్ద నివాళులు అర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 9.10 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి ఉదయం 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగనున్న వైసీపీ ప్లీనరీకి హాజరవుతారు. 

ఇక, సీఎం జగన్ కడప జిల్లా టూర్ నేపథ్యంలో.. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను మంగళవారం లెక్టర్‌ వి విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పరిశీలించారు. స్థానిక అధికారులకు, పోలీసులకు తగు సూచనలు జారీచేశారు. ముఖ్యమంత్రి పర్యటించే పలు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

click me!