తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మూడు రోజులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల

By Sumanth KanukulaFirst Published Jul 6, 2022, 10:14 AM IST
Highlights

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఈనెల 12, 15, 17 తేదీలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఈనెల 12, 15, 17 తేదీలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. శ్రీవారి భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని కోరింది. ఇక, రేపు (జూలై 7) సెప్టెంబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను విడుదల చేయనున్నట్టుగా టీటీడీ పేర్కొంది. ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి.  

ఇక, తిరుమలలో కొనసాగుతున్న   భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. మంగళవారం శ్రీవారిని 73,439 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,490 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.35 కోట్లుగా ఉంది. సర్వదర్శనానికి 31 కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతుంది. 

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో శ్రీవారి సర్వదర్శనానికి అనుమతించారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీవారి హుండీ కానుకలు కూడా పెరుగుతున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో గత రెండేళ్లుగా తిరుమలకు రాలేని భక్తులు స్వామిని దర్శించుకుని భారీగా హుండీ కానుకలు సమర్పించుకుంటున్నారు. శ్రీవారికి  భక్తులు సోమవారం భారీగా రూ.6.18 కోట్ల కానుకల్ని హుండీలో సమర్పించుకున్నారు. తిరుమల శ్రీవారి ఒకరోజు హుండీ ఆదాయం రూ.6 కోట్లు దాటటం ఇది రెండోసారి. 2018 జూలై 26న రూ.6.28 కోట్ల కానుకలు భక్తులు హుండీలో సమర్పించుకున్నారు.

click me!