ప్రకాశం జిల్లాలో పెన్షన్ పంపిణీలో దొంగ నోట్ల కలకలం.. లబ్దిదారుల్లో ఆందోళన..

By Sumanth KanukulaFirst Published Jan 1, 2023, 11:10 AM IST
Highlights

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో దొంగనోట్ల కలకలం రేపుతున్నాయి. ఈరోజు ఉదయం పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తుండగా దొంగ నోట్ల వ్యవహారం వెలుగుచూసింది.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో దొంగనోట్ల కలకలం రేపుతున్నాయి. ఈరోజు ఉదయం పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తుండగా దొంగ నోట్ల వ్యవహారం వెలుగుచూసింది. వివరాలు..యర్రగొండపాలెం మండలంలోని నర్సపాలెంలో గ్రామ వాలంటీర్ ఈరోజు ఉదయం పెన్షన్ డబ్బులు పంపిణీ చేశారు. అయితే పెన్షన్‌ అందుకున్న లబ్దిదారులు అందులో దొంగనోట్లు ఉన్నట్టుగా గుర్తించారు. 38 నకిలీ రూ. 500 నోట్లను గుర్తించిన పెన్షన్ లబ్దిదారులు వాటిని వాలంటీర్‌కు తిరిగి ఇచ్చేశారు. 

దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేేపుతుంది. అయితే పెన్షన్‌కు పంపిణీకి సంబంధించిన నగదును గ్రామ కార్యదర్శి, సచివాలయ వెల్‌ఫేర్ అసిస్టెంట్.. యర్రగొండపాలెం బ్యాంక్‌లో డ్రా చేసినట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. దొంగ నోట్లు ఎలా వచ్చాయనేది తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే పెన్షన్‌లో దొంగ నోట్లు రావడంతో లబ్దిదారుల్లో ఆందోళన నెలకొంది. 

click me!