తూర్పుగోదావరి కొమరపాలెంలో దారుణం: యువకుడిని చంపిన దుండుగులు

Published : Jan 01, 2023, 10:55 AM IST
తూర్పుగోదావరి కొమరపాలెంలో   దారుణం: యువకుడిని చంపిన  దుండుగులు

సారాంశం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కొమరపాలెంలో  ఆదివారం నాడు చిన్నా అనే యువకుడిని  దుండగులు కత్తితో పొడిచి చంపారు.  ఈ ఘటనపై  మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజమండ్రి: ఉమ్మడి తూర్పుగోదావరి  జిల్లాలోని  కొమరపాలెంలో ఆదివారం నాడు  తెల్లవారుజామున చిన్నా అనే యువకుడిని  దుండగులు  కత్తితో పొడిచి చంపారు.  కొత్త సంవత్సరం వేళ  చిన్నాకు దుండగుల మధ్య  గొడవ జరిగిందని చెబుతున్నారు.ఈ గొడవ తర్వాత  చిన్నా ఇంటికి వచ్చిన దుండగులు అతనిపై  కత్తితో  దాడికి దిగినట్టుగా  స్థానికులు చెబుతున్నారు. చిన్నాపై  దుండగులు  దాడి చేసిన దృశ్యాలు  సీసీటీవీ దృశ్యాల్లో రికార్డయ్యాయి.  ఈ విషయమై  మృతుడి కుటుంబ సభ్యులు  పోలీసులకు పిర్యాదు  చేశారు. ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు