రేపే ప్రమాణస్వీకారం... జగన్ స్పెషల్ ఎంట్రీ

Published : May 29, 2019, 10:12 AM IST
రేపే ప్రమాణస్వీకారం... జగన్ స్పెషల్ ఎంట్రీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలో ఇప్పటికే ప్రమాణస్వీకారానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలో ఇప్పటికే ప్రమాణస్వీకారానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రమాణస్వీకారానికి వచ్చే అతిథులు, ప్రజలు, వైసీపీ అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.... ఈ కార్యక్రమంలో  జగన్ వేదికపైకి స్పెషల్ గా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఇందిరాగాంధీ స్టేడియం చుట్టూ ఉన్న గ్యాలరీలలో కూర్చునే సాధారణ ప్రజలకు జగన్ ఓపెన్ టాప్ వాహనంపై నిలుచుని అభివాదం చేయనున్నారు. స్టేడియం చుట్టూ 20 గ్యాలరీల్లోని ప్రజలకు ఆయన అభివాదం చేస్తారు. ఆ తర్వాత ప్రధాన వేదిక ప్రాంగణానికి చేరుకున్న తర్వాత.. ప్రత్యేక ఆహ్వానితులు, వీఐపీలు, అధికారులు కూర్చునే గ్యాలరీలలోకి ప్రత్యేక వార్డ్‌రోబ్ మీద నడుచుకుంటూ వెళ్లి అభివాదం చేసే విధంగా ఏర్పాట్లు చేపడుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్