ఏపీలో కాంగ్రెస్ కి షాక్: పీసీసీ చీఫ్ పదవికి రఘువీరారెడ్డి రిజైన్

By Nagaraju penumalaFirst Published May 29, 2019, 9:35 AM IST
Highlights

రాష్ట్రంలో పార్టీ బలహీనానికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజీనామా లేఖలో తెలిపారు. రఘువీరారెడ్డి రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి సైతం రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. 
 
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే పార్టీకి రాజీనామా చేసేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి ఎన్.రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. 

రాష్ట్రంలో పార్టీ బలహీనానికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజీనామా లేఖలో తెలిపారు. రఘువీరారెడ్డి రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి సైతం రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. 

తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగలేనని భీష్మించుకుని కూర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కురువృద్ధులు బతిమిలాడుతున్న కనీసం కనికరించడం లేదు. గాంధీ-నెహ్రూ కుటుంబాలు కాకుండా వేరే వారికి అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ చెప్తున్నారు. 

రాహుల్ గాంధీని రాజీనామా విత్ డ్రా చేసుకోవాలని సీడబ్ల్యూసీ కోరుతున్నా ఆయన మాత్రం వెనక్కితగ్గడం లేదు. ఒకవేళ రాహుల్ గాంధీ రాజీనామా ఆమోదమైతే దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు మాజీలు అవుతారు. 

click me!