మరోసారి వివాదంలోకి చింతమనేని

Published : May 29, 2019, 09:30 AM ISTUpdated : May 29, 2019, 09:31 AM IST
మరోసారి వివాదంలోకి చింతమనేని

సారాంశం

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. దీంతో... దుగ్గిరాలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. దీంతో... దుగ్గిరాలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే... మంగళవారం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి వేడుకులు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు యత్నించడంతో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రాత్రి జరిగిన ఈ ఘటనతో ఏలూరు సమీపంలోని దుగ్గిరాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలు, ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొనడంతో దుగ్గిరాలలో పోలీస్‌ పికెట్ ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని పెదవేగి తహసీల్దార్‌ ఆఫీసుకు పోలీసులు తరలించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్