కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సంచలన ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో కరోనా వైరస్ సోకనివారు ఉండరేమోనని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా కలెక్టర్ల తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: కరోనా వైరస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో కరోనా వైరస్ రానివారు ఉండరేమో అని ఆయన అన్నారు. స్పందన, అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం్చారు.
చిన్న చిన్న దుకాణాల నుంచి షాపులన్నీ తెరవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. వచ్చే మూడు రోజుల్లో ప్రజా రవాణా ప్రారంభమవుతుందని జగన్ చెప్పారు. అందరూ స్వచ్ఛందంగా వచ్చి కరోనా పరీక్షలను చేయించుకోవాలని ఆయన సూచించారు.
undefined
కరోనా నివారణలో అందరూ అద్భుతంగా పనిచేశారని జగన్ ప్రశంసించారు. నాలుగో విడత లౌక్ డౌన్ లో ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాలని ఆనయ అన్నారు. ఇందులో కలెక్టర్లు, ఎస్పీలు భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కావడం లేదు. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 9,739 శాంపిల్స్ ను పరీక్షించగా 57 మందికి కోవిడ్ -19 పాజిటివ్ ఉన్నట్లు తేలింది. 69 మంది కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకున్నారు.
మొత్తం ఏపీలో కరోనా వైరస్ కేసులు 2339కి చేరుకున్నాయి. 1596 మంది చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ కాగా, 691 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనా వైరస్ తో మరో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 52కు చేరుకుంది. గత 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒకరు, చిత్తూరు జిల్లాలో మరొకరు మరణించారు.
కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చినవారిలో ఆరుగురికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వారిలో ఐదుగురు చిత్తూరు జిల్లాకు చెందినవారు కాగా, ఒక్కరు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు.