
విశాఖపట్టణం: 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఎన్నికల హామీలను వైసీపీ అధినేత జగన్ లీకు చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్టణం కోటవురట్లలోని బహిరంగ సభలో పాల్గొన్న జగన్ టీడీపీపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ప్రతీ ఇంటికి కేజీ బంగారం ఇస్తానని కేజీ బంగారంతో బోనస్ గా బెంజ్ కారు కూడా ఇస్తానని హామీలిస్తారని తెలిపారు.
అయితే ఈ హామీలన్నీ నిజమైనవి కావని ఇలాంటి అబద్దపు హామీలు కూడా ఇస్తారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చెయ్యలేదని కానీ 95శాతం అమలు చేశాం అని ఆబద్దాలు చెప్పే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈసారి బంగారం, బెంజ్ కారు అంటూ మీ చెవుల్లో ఖాళీఫ్లవర్ పెట్టేందుకు రెడీ అవుతారని విమర్శించారు.