పాముకాటుకు మరో ఇద్దరు బలి, కృష్ణా జిల్లాలో పెరుగుతున్న మృతులు

By Arun Kumar PFirst Published Aug 20, 2018, 5:42 PM IST
Highlights

కృష్ణా జిల్లాలో పాము కాటు మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా పాములు కలుగుల్లోంచి బైటికివస్తుంటాయి. ఇలా బైటికివచ్చిన పాములు ఊళ్లలోకి, పొలాల్లోకి ప్రవేశించి మనుషుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. వర్షాకాలంలో పొలం పనులు ఊపందుకోవడంతో రైతులు పగలనక, రాత్రనక పనులు చేస్తుంటారు. ఇలా పొలం పనులకు వెళ్లే రైతులు భారీగా పాముకాట్లకు గురవుతూ వైద్యం అందక చనిపోతున్నారు.

కృష్ణా జిల్లాలో పాము కాటు మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా పాములు కలుగుల్లోంచి బైటికివస్తుంటాయి. ఇలా భయటికివచ్చిన పాములు ఊళ్లలోకి, పొలాల్లోకి ప్రవేశించి మనుషుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. వర్షాకాలంలో పొలం పనులు ఊపందుకోవడంతో రైతులు పగలనక, రాత్రనక పనులు చేస్తుంటారు. ఇలా పొలం పనులకు వెళ్లే రైతులు భారీగా పాముకాట్లకు గురవుతూ వైద్యం అందక చనిపోతున్నారు.

గత మూడు రోజుల నుండి ఈ పాము కాట్ల బాధితుల సంఖ్య పెరుగుతోంది. అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇప్పటివరకు పాము కాటు బాధితుల సంఖ్య 38 కి చేరినట్లు సమాచారం. ఇలా మొన్న ఒక్కరోజే 27 పాము కాటు కేసులు నమోదవగా, నిన్న ఇవాళ కలిపి మరో 11 కేసులు నమోదయ్యాయి.

ఇవాళ తెలప్రోలు గ్రామానికి చెందిన పూర్ణచంద్రరావు అనే రైతు పాము కాటుకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఇతడిని విజయవాడలోని జిజిఎం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఈ రైతు ప్రాణాలను కాపాడలేక పోయారు. అదే విధంగా గన్నవరం మండలం అజ్జంపూడికి చెందిన మరో యువకుడు కూడా పాముకాటుకు గురై మృతిచెందాడు.

ఈ పాముల  సంచారంతో ప్రజలు పొలాలకు వెళ్లడానికి భయపడుతున్నారు. పాము కాట్ల మృతుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   అయితే  గ్రామాల్లోని ప్రాథమిక చికిత్సా కేంద్రాల్లో యాంటి స్నెక్ డ్రగ్స్ ని ఉంచాలని జిల్లా వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. పాము కాటుకు గురవగానే నాటు వైద్యం జోలికి వెళ్లకుండా నేరుగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాలని ప్రజలకు సూచించారు. 

 

click me!