సీజెఐకి జగన్ లేఖ కోర్టు ధిక్కారమే: అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్

By telugu teamFirst Published Nov 2, 2020, 5:46 PM IST
Highlights

సీజెఐకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన లేఖ కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. అశ్వినీ ఉపాధ్యాయ రాసిన లేఖకు ఆయన సమాధానం ఇచ్చారు.

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజెఐ)కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన లేఖ కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ లేఖపై ఆయన స్పందించారు. జగన్ మీద కోర్టు ధిక్కారం కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గతంలో అశ్వినీ ఉఫాధ్యాయ వేణుగోపాల్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. 

ఆ లేఖపై కేకే వేణుగోపాల్ స్పందించారు. ఈ మేరకు ఆయన అశ్వినీ ఉపాధ్యాయకు లేఖ రాశారు. సీజేఐకి జగన్ రాసిన లేఖ కచ్చితంగా కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని వేణుగోపాల్ అన్నారు. సీజేఐకి రాసిన లేఖను బహిర్గతం చేయడం కోర్టు దిక్కారం కిందికే వస్తుందని ఆయన అన్నారు. 

Also Read: సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణపై సీజేఐకి జగన్ లేఖ: ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సీరియస్

ప్రజాప్రతినిధులకు సంబంధించి జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు తర్వాత జగన్ ఆ లేఖ రాయడం, దాన్ని బహిర్గతం చేసిన సందర్భం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. అన్ని విషయాలూ సీజేఐకి తెలుసునని, ప్రత్యేకంగా కోర్టు ధిక్కారం కోసం అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 

ఇప్పటికే జగన్ మీద 31 కేసులు ఉన్న విషయాన్ని అటార్నీ జనరల్ గుర్తు చేశారు. సీజేఐకి జగన్ రాసిన లేఖ ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ లేఖపై జగన్ మీద కోర్టు ధిక్కార కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉపాధ్యాయ అటార్నీ జనరల్ కు లేఖ రాశారు. దానికి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదనే పద్ధతిలో అటార్నీ జనరల్ సమాధానం ఇచ్చారు.

Also Read: అమరావతి స్కామ్‌లో ట్విస్ట్: సీజేఐకి జగన్ లేఖ.. అజేయ కల్లం కీలక ప్రకటన

click me!