రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.