నాన్నా.. కోట్లాది కుటుంబాలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి.. జగన్ భావోద్వేగ పోస్టు

By Galam Venkata Rao  |  First Published Jul 8, 2024, 10:58 AM IST

‘‘నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి.’’


వైఎస్ఆర్ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఊరూరా వేడుకలు జరుగుతున్నాయి. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వ‌ద్ద రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్‌ ఘాట్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సందర్శించారు. వైసీపీ నేతలు, కుటుంబ సభ్యులతో కలిసి త‌న తండ్రికి ఘ‌న నివాళుల‌ర్పించారు. వైఎస్ జ‌గ‌న్‌ వెంట తల్లి విజయమ్మ, సతీమణి భారతి తదితరులు ఉన్నారు. 

Latest Videos

ఈ సందర్భంగా వైఎస్ఆర్‌ను గుర్తుచేసుకుంటూ జ‌గ‌న్ ఓ ట్వీట్ చేశారు. ‘‘నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా… చివరి వరకూ మా కృషి’’ అని మాజీ సీఎం వైఎస్ జగ‌న్మోహన్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు…

— YS Jagan Mohan Reddy (@ysjagan)

అలాగే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఇడులపాయలోని తండ్రి సమాధిని సందర్శించారు. తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్, కుమారుడు, కుమార్తెతో పాటు కాంగ్రెస్ నాయకులతో కలిసి వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించి ఘనంగా నివాళి అర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. రాజశేఖర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. 

ఈ సందర్భంగా ఓ పోస్టు పెట్టారు. ‘‘మీ 75 పుట్టిన రోజును స్వర్గంలో ఘనంగా జరుపుకుంటున్నారని నమ్ముతున్నాను. మీరు నాపై కురిపించిన ప్రేమకు ధన్యవాదాలు. దాన్ని ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగా ఉంచుతాను. మీ మూలాలను, భావజాలాన్ని వారసత్వాన్ని కొనసాగానని వాగ్దానం చేస్తున్నా’’ అని షర్మిల ట్వీట్ చేశారు.

 

I believe your 75th birthday is splendidly celebrated in heaven Pa.
Thank you for the all love you showered on me. Will cherish it close to my heart forever and promise to hold on to your cords, your roots, your ideology and your legacy. pic.twitter.com/HZcLqmBOH5

— YS Sharmila (@realyssharmila)
click me!