ఈ నెల 28న మూడో ఫేజ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం: స్పందనలో సీఎం జగన్

By narsimha lode  |  First Published Apr 26, 2022, 5:05 PM IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంతో పాటు పలు అంశాలపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారు.


ఈ నెల 28న మూడో ఫేజ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం: స్పందనలో సీఎం జగన్

అమరావతి: ఇళ్ల నిర్మాణంపై అధికారులు కేంద్రీకరించాలని ఏపీ సీఎం YS Jagan అధికారులను కోరారు.ఏప్రిల్, మే, జూన్‌... నెలల్లో ముమ్మరంగా పనులు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.

Latest Videos

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో Spandana కార్యక్రమంలో సీఎం  వైఎస్‌ జగన్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్పందనలో భాగంగా ఉపాధి హామీ కార్యక్రమం కింద చేపట్టిన పనులు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లినిక్స్, డిజిటిల్‌ లైబ్రరీలు, ఏఎంసీలు, బీఎంసీలు, గృహనిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం, జగనన్న భూ హక్కు వంటి వాటిపై అర్జీల పరిషారం తదితర అంశాలపై సీఎం సమీక్ష జరిపారు.ప్రతిజిల్లాలో కూడా ప్రతిరోజూ కనీసం 1 లక్షల పనిదినాలు చేయాని సీఎం సూచించారు. నెలలో కనీసంగా 25 లక్షల పని దినాలు చేపట్టాలన్నారు.

తొలిదశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. లే అవుట్లలో 11.9 లక్షలు, సొంతప్లాట్లు లేదా పొసెషన్‌ సర్టిఫికెట్లు పొందని వారి స్థలాల్లో 3.7 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని సీఎం ఆదేశించారు. కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణం పెండింగులో పండిందని సీఎం చెప్పారు.ఈ కేసుల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలన్నారు.అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాల్సిందేన్నారు., దీనికి ఎంత ఖర్చైనా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు.
కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఆప్షన్‌ 3 ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణంపైనా కలెక్టర్లు దృష్టిపెట్టాలని సీెం సూచించారు.ప్రతి వేయి ఇళ్లకూ ప్రత్యేకంగా ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ను పెట్టాలన్నారు.

కంపెనీల నుంచి cement సప్లైలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి collectors ఒక నోడల్‌ అధికారిని నియమించుకోవాలన్నారు. సిమెంటు, స్టీలు, ఇసుక, మెటల్‌ సరఫరా సవ్యంగా సాగేలా నోడల్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలని కోరారు. ప్రతి సచివాలయం పరిధిలో మరోసారి పునఃపరిశీలన చేసి భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని కోరారు.డిసెంబర్‌ నాటికి 4545 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం పూర్తి కావాలని సీఎం సూచించారు.
అదే సమయానికి ఇంటర్నెట్‌ కేబుల్‌కూడా సంబంధిత గ్రామాలకు చేరుకుంటుందన్నారు.

ఆప్షన్‌ 3 కింద ఇళ్ల నిర్మాణాన్ని ఈనెల 28న ప్రారంభిస్తున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు.అదే రోజు 1.23 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు.అదే రోజున 1.79 లక్షల పీఎంఏబై, వైఎఎస్సార్‌-గామీణ్‌ ఇళ్ల నిర్మాణంకూడా ప్రారంభిస్తున్నామన్నారు.

మొదటి విడత ఇళ్ల నిర్మాణంలో భాగంగా 15.6 లక్షలు, టిడ్కోలో 2.62 లక్షలు, విశాఖపట్నంలో 1.23 లక్షలు, పీఎంఏవై-వైఎస్సార్‌ గ్రామీణ్‌ ద్వారా 1.79లక్షల ఇళ్లు నిర్మాణాలు జరుగుతాయని సీఎం వివరించారు.ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులను సత్కరిస్తామని సీఎం చెప్పారు.మండలానికో సర్పంచి, మున్సిపాల్టీలో కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, జిల్లాకు ఒక జడ్పీటీసీ చొప్పున వారికి అవార్డులు ఇస్తామన్నారు.

ఇళ్ల నిర్మాణం, స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు – నేడు, సమగ్ర భూసర్వే, స్పందనలో అర్జీల పరిష్కారంలో నాణ్యత, ఎస్‌డీజీ లక్ష్యాలు, ఉపాధిహామీ పనులు, సచివాలయాల పనితీరు వంటి  అంశాల్లో ప్రగతి ఆధారంగా కలెక్టర్లు, జేసీల పనితీరును మదింపు చేస్తామని సీఎం వివరించారు.ఏసీబీ, ఎస్‌ఈబీ, దిశ, సోషల్‌మీడియా ద్వారా వేధింపుల నివారణ అంశాల్లో ప్రగతి ఆధారంగా ఎస్పీల పనితీరును మదింపు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
 

click me!