డిసెంబర్ 2023 నాటికి 46లక్షల విద్యుత్ మీటర్లు... కేంద్ర మార్గదర్శకాలివే.: విద్యుత్ మంత్రితో అధికారులు

Arun Kumar P   | Asianet News
Published : Apr 26, 2022, 04:18 PM IST
డిసెంబర్ 2023 నాటికి 46లక్షల విద్యుత్ మీటర్లు... కేంద్ర మార్గదర్శకాలివే.: విద్యుత్ మంత్రితో అధికారులు

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి డిస్కంల సీఎండిలు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి తెలిపారు. 

అమరావతి:  విద్యుత్ రంగంలో డిస్కంల పాత్ర కీలకమైనదని... ప్రజలకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్ ను అందించడంలో వారధిగా నిలుస్తున్న డిస్కంలు తమ పనితీరును మరింత మెరుగు పరుచుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరాలో సాంకేతిక నష్టాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు డిస్కంలు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 

సచివాలయంలో ఈస్ట్, సెంట్రల్, సౌత్ డిస్కం సిఎండిలతో పాటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి  మాట్లాడుతూ... విద్యుత్ చౌర్యాలను పూర్తిస్థాయిలో అరికట్టాలని సూచించారు.అలాగే ఓవర్ లోడ్, లో ఓల్టేజీ వంటి సమస్యలను నియత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. 

 వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ విషయంలో ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలని మంత్రి కోరారు. ట్రాన్స్ ఫార్మర్ లు ఫెయిల్ అయిన వెంటనే డిస్కం అధికారులు తక్షణం స్పందించాలని...  వారం రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లను మార్చాలని సూచించారు. రోజుల తరబడి ట్రాన్స్ ఫార్మర్ లను మార్చడంలో జాప్యం చేస్తున్నారని...  దీనివల్ల రైతులు పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇలాంటి విమర్శలు రాకుండా డిస్కం సిఎండిలు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. 

డిస్కం సీఎండీలు క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుందని మంత్రి అన్నారు. ట్రాన్స్ ఫార్మర్ ల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని సూచించారు. ట్రాన్స్ ఫార్మర్ ల ఫెయిల్యూర్ రేటును మరింత తగ్గించాలని మంత్రి అన్నారు.  క్వాలిటీ టెస్టింగ్ , సిపిఆర్ఐ డిజైన్లు, నిబంధనల ప్రకారం పరీక్షించిన తరువాతే ట్రాన్స్ ఫార్మర్ ల కొనుగోలు చేయాలన్నారు.  ఇందుకోసం మొత్తం రూ.4,113 కోట్లు వ్యయం అవుతుందని మంత్రి తెలిపారు. 

''జగనన్న కాలనీలు సీఎం మానస పుత్రికలు''

జగనన్న కాలనీలు సీఎం వైఎస్ జగన్ మానస పుత్రికలని... కాబట్టి ఈ కాలనీలకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించడాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 31 మంది పేదలకు ఇళ్ళస్థలాలు, పక్కాగృహాలను మంజూరు చేశారని... వాటిని అన్ని వసతులను కల్పించాలనే లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ దీపాలు, గృహ విద్యుత్ కనెక్షన్లు, మంచినీటి సరఫరాకు విద్యుత్ సదుపాయం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. జగనన్న కాలనీలకు ఫేజ్ -1 కింద 10,067 లేఅవుట్ల లోని 14.80 లక్షల ప్లాట్ లకు రూ.4500 కోట్లతో విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని... ఈ పనుల విషయంలో పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. 

కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై అధికారులు మంత్రికి వివరించారు. ఆర్డిఎస్ఎస్ కింద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 59.19 లక్షల స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాల్సి ఉందని, 2023 డిసెంబర్ నాటికి 46.41 లక్షల మీటర్లు భిగించాల్సి ఉందని తెలిపారు. అలాగే 2025 మార్చి నాటికి మరో 12.77 లక్షల మీటర్లను భిగించాల్సి ఉంటుందని అధికారులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!