లండన్ చేరుకున్న జగన్: సెల్పీలకు ఎన్నారైల పోటీ

Published : Feb 21, 2019, 01:45 PM IST
లండన్ చేరుకున్న జగన్: సెల్పీలకు ఎన్నారైల పోటీ

సారాంశం

అర్థరాత్రి 12 గంటలకు విమానంలో లండన్ వెళ్లారు. లండన్ చేరుకున్న వైఎస్ జగన్ కు ప్రవాసాంధ్రలు ఘన స్వాగతం పలికారు. హెత్రో విమానాశ్రయంలో జగన్ తో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఈనెల 25 వరకు వైఎస్ జగన్ లండన్ లో ఉండనున్నారు. 

లండన్: ఆరు రోజులపాటు లండన్ పర్యటనలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉదయం లండన్ చేరుకున్నారు. లండన్ లో తన పెద్దకుమార్తెను చూసేందుకు వైఎస్ జగన్ భార్య భారతి, చిన్న కుమార్తెతో కలిసి లండన్ వెళ్లారు. 

అర్థరాత్రి 12 గంటలకు విమానంలో లండన్ వెళ్లారు. లండన్ చేరుకున్న వైఎస్ జగన్ కు ప్రవాసాంధ్రలు ఘన స్వాగతం పలికారు. హెత్రో విమానాశ్రయంలో జగన్ తో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఈనెల 25 వరకు వైఎస్ జగన్ లండన్ లో ఉండనున్నారు. 

అనంతరం ఈనెల 26న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. 27న  తాడేపల్లిలో నిర్మించిన నూతన గృహా ప్రవేశం చెయ్యనున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ కార్యాలయాన్ని కూడా వైఎస్ జగన్ ప్రారంభించనున్నట్లు సమాచారం. జగన్ లండన్ పర్యటన అనంతరం ఇక పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?