ఆన్‌లైన్ లోన్ యాప్స్ వేధింపులపై జగన్ సీరియస్: కఠిన చర్యలకు ఆదేశం

By narsimha lode  |  First Published Dec 22, 2020, 6:10 PM IST

ఆన్ లైన్ కాల్ మనీ వ్యవహారాలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. లోన్ యాప్స్ వేధింపులకు కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు.
 


అమరావతి:ఆన్ లైన్ కాల్ మనీ వ్యవహారాలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. లోన్ యాప్స్ వేధింపులకు కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు.లోన్ యాప్స్ సంస్థ వేధింపుల కారణంగా  కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు వేధింపులకు పాల్పడ్డారు.

also read:మైక్రో ఫైనాన్స్ యాప్స్: గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించాలని గూగుల్‌కి పోలీసుల లేఖ

Latest Videos

రాష్ట్రంలో కూడ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ విషయమై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టుగా ఏపీ డీజీపీ తెలిపారు. వేధింపులకు గురైన వారంతా పోలీసులకు ఫిర్యాదు  చేయాలని డీజీపీ ఆదేశించారు. ఏపీ రాష్ట్రంలో కంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ తరహా  కేసులు ఎక్కువగా చోటు చేసుకొన్నాయి.

విజయవాడలో లోన్ యాప్స్ వేధింపులకు సంబంధించి మంగళవారం నాడు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ నుండి ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాలకు  పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

click me!