బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి పునరావాసంపై పీపీఏ సీఈఓ అసంతృప్తి

By narsimha lodeFirst Published Dec 22, 2020, 5:56 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్టులో బుట్టాయిగూడెం, జీలుగుమిల్లిలో పునరావాసంపై  పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఏలూరు: పోలవరం ప్రాజెక్టులో బుట్టాయిగూడెం, జీలుగుమిల్లిలో పునరావాసంపై  పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

బుట్టాయిగూడెం, జీలుగుమిల్లిలో నిర్మాణ పనులు 20 శాతం మాత్రమే జరగడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఆర్ అండ్ ఆర్ జాప్యం వల్లే కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కాలేదన్నారు. కాలనీ నిర్మాణాలు పూర్తైతేనే కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తౌతోందన్నారు. 

also read:పోలవరం ప్రాజెక్టు: పనులను పరిశీలించిన పీపీఏ సీఈఓ

2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టుగా ఆయన చెప్పారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పీపీఏ సీఈఓ  చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో బృందం ఇటీవలనే ప్రాజెక్టును సందర్శించారు.  ప్రాజెక్టు పనులపై ఈ బృందం సంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ప్రాజెక్టు  పనులను పరిశీలనలో భాగంగా ఇవాళ ఈ రెండు ప్రాంతాలను పరిశీలించిన చంద్రశేఖర్ అయ్యర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
 

click me!