వైఎస్ జగన్ గృహప్రవేశం వాయిదా

By Nagaraju penumalaFirst Published Feb 12, 2019, 9:27 PM IST
Highlights

గృహ ప్రవేశానికి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ని కూడా ఆహ్వానించారని కూడా ప్రచారం జరిగింది. గృహప్రవేశం సింపుల్ గా చేసి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం మాత్రం ఒక వైభవంగా చెయ్యాలని ప్లాన్ చేశారు. 

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నూతన గృహప్రవేశం కార్యక్రమం వాయిదా పడింది. గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ రోడ్డు సమీపంలో జగన్ తన నివాసాన్ని నిర్మించుకుంటున్నారు. నివాసంతోపాటు పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు. 

అయితే దాదాపు పనులు పూర్తి కావచ్చిన నేపథ్యంలో ఈ నెల 14న ఉదయం 8గంటల 21 నిమిషాలకు నూతన గృహ ప్రవేశం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. నూతన గృహ ప్రవేశానికి కుటుంబ సభ్యులతోపాటు కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించాలని నిర్ణయించారు. 

గృహ ప్రవేశానికి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ని కూడా ఆహ్వానించారని కూడా ప్రచారం జరిగింది. గృహప్రవేశం సింపుల్ గా చేసి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం మాత్రం ఒక వైభవంగా చెయ్యాలని ప్లాన్ చేశారు. 

అయితే వైఎస్ జగన్ సోదరి శ్రీమతి షర్మిల, బావ బ్రదర్ అనిల్ అనారోగ్యం కారణంగా గృహ ప్రవేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. సాంప్రదాయ ప్రకారం సోదరి పాలుపొంగించాల్సి ఉండటంతో సోదరి షర్మిల అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో గృహప్రవేశాన్ని వాయిదా వేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ అమరావతి ఇంటి ముహూర్తం ఇదే: కేసీఆర్ కూ పిలుపు

click me!