రాష్ట్రం కోసం అర్జునరావు ప్రాణ త్యాగం : కుటుంబ సభ్యులను ఓదార్చిన చంద్రబాబు

By Nagaraju penumalaFirst Published Feb 12, 2019, 9:11 PM IST
Highlights

భవిష్యత్తులో అర్జునరావు కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. గవ్వల అర్జునావు చనిపోవడం చాలా బాధగా ఉందని చంద్రబాబు అన్నారు. అర్జునరావు ఎవరికీ చెప్పకుండా ఢిల్లీకి వచ్చారని, ధర్నా చేస్తున్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీకాకుళం జిల్లాకు చెందిన అర్జునరావు కుటుంబ సభ్యులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఢిల్లీలోని లేడీ హార్డింగ్ ఆస్పత్రిలో అర్జునరావు మృతదేహానికి నివాళులర్పించారు. 

సోమవారం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఆ దీక్షకు హాజరైన అర్జునరావు తన ఆత్మహత్యతోనైనా కేంద్రప్రభుత్వం, మోదీలో కదలిక వస్తుందని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అర్జునరావు మృతిపట్ల విచారం వ్యక్తం చేసిన సీఎం రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 

భవిష్యత్తులో అర్జునరావు కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. గవ్వల అర్జునావు చనిపోవడం చాలా బాధగా ఉందని చంద్రబాబు అన్నారు. అర్జునరావు ఎవరికీ చెప్పకుండా ఢిల్లీకి వచ్చారని, ధర్నా చేస్తున్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్రం కోసం ఆయన ప్రాణత్యాగం చేశారని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఇక ఏపీకి హోదా రాదని మనస్తాపం చెంది కనీసం తాను ఆత్మహత్య చేసుకుంటే కేంద్రంలో, మోదీలో కదలిక వస్తుందనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తోందని ఇకనైనా కల్లుతెరవాలని చంద్రబాబు సూచించారు. 

click me!