హెలికాప్టర్ లో సచివాలయానికి జగన్: మహేష్ బాబు సినిమాలో లాగా...

By telugu teamFirst Published Jun 19, 2019, 3:22 PM IST
Highlights

కాన్వాయ్ ని పక్కన పెట్టేసి వైఎస్ జగన్ ప్రతి రోజూ సచివాలయానికి హెలికాప్టర్ లో వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తాడేపల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వాహన శ్రేణి ద్వారా వెళ్తున్నారు. దానివల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు.

అమరావతి: మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రి ఇంటి నుంచి సచివాలయం వెళ్లడానికి హెలికాప్టర్ వాడుతాడు. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి సచివాలయం వెళ్లడానికి హెలికాప్టర్ వాడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

కాన్వాయ్ ని పక్కన పెట్టేసి వైఎస్ జగన్ ప్రతి రోజూ సచివాలయానికి హెలికాప్టర్ లో వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తాడేపల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వాహన శ్రేణి ద్వారా వెళ్తున్నారు. దానివల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. 

ముఖ్యమంత్రి కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుండడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. తాను వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు విధించవద్దని ఆయన పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ భద్రతాపరమైన చర్యల కారణంగా ఆంక్షలు విధించక తప్పడం లేదు. ఇటీవల జగన్ కాన్వాయ్ లోకి ఇతర వాహనాలు చొచ్చుకొచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో విజయవాడలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా హెలికాప్టర్ ను వాడాలని జనగ్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అందుకు జగన్ నివాసం వద్ద హెలికాప్టర్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. జగన్ నివాసానికి ఐదు వందల మీటర్ల దూరంలోని పాత ప్యారీ కంపెనీ స్థలంలో కొత్త హెలిప్యాడ్ ను సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్ లో నేరుగా సచివాలయానికి చేరుకునే అవకాశం ఉంటుంది. 

click me!