పార్టీ ఫిరాయింపులపై జేసి ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Jun 19, 2019, 3:11 PM IST
Highlights


మరోవైపు తన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి, తాను బీజేపీలో చేరుతున్నామంటూ వస్తున్న వార్తలను ఖండించారు. తాము బీజేపీలో చేరాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. డబ్బు కావాలనుకునేవారే పార్టీ మారతారని తమకు ఆ అవసరం లేదన్నారు.  
 

అనంతపురం: పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. డబ్బు కావాలనుకునే వారే పార్టీలు మారతారంటూ చెప్పుకొచ్చారు. తమకు ఆ అవసరం లేదని చెప్పుకొచ్చారు. 

తాము బీజేపీలో చేరాలనుకోవడం లేదన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. అనంతపురం జిల్లాలో పోలీసుల పనితీరు చాలా బాగుందని కితాబిచ్చారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉందని తాను తాడిపత్రిలో స్వేచ్ఛగా తిరుగుతున్నానంటూ చెప్పుకొచ్చారు. 

ఇదిలా ఉంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని టీడీపీ పదేపదే ఆరోపిస్తోంది. ఈ తరుణంలో తమ నియోజకవర్గంలో దాడులు జరగడం లేదంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. 

ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. కేతిరెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ స్పీకర్ కు పంపితే అతనిపై వేటు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. గెలిచిన ఎమ్మెల్యే కాస్త హుందాగా నడుచుకోవాలని సూచించారు. 

మరోవైపు తన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి, తాను బీజేపీలో చేరుతున్నామంటూ వస్తున్న వార్తలను ఖండించారు. తాము బీజేపీలో చేరాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. డబ్బు కావాలనుకునేవారే పార్టీ మారతారని తమకు ఆ అవసరం లేదన్నారు.  

click me!