పుదుచ్చేరి మంత్రికి జగన్ ఫోన్: ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

By Nagaraju penumalaFirst Published May 29, 2019, 7:39 AM IST
Highlights

వైయస్ జగన్ తనకు ఫోన్ చేసిన విషయాన్ని స్పష్టం చేశారు. ఈనెల 30న విజయవాడ వెళ్లనున్నట్లు తెలిపారు. ప్రమాణస్వీకారానికి హాజరై ఆ తర్వాత జూన్ 10లోగా మరోసారి వైయస్  జగన్ తో భేటీ కానున్నట్లు తెలిపారు. యానాంకు సంబంధించి సరిహద్దుల విషయంతోపాటు ఇరు ప్రాంతాల మధ్య సత్సమ సంబంధాలపై చర్చించనున్నట్లు తెలిపారు.

పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతమైనా పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. ఈనెల 30న విజయవాడలో తాను చేయబోతున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా జగన్ ఆహ్వానించారు. 

వైయస్ జగన్ తనకు ఫోన్ చేసిన విషయాన్ని స్పష్టం చేశారు. ఈనెల 30న విజయవాడ వెళ్లనున్నట్లు తెలిపారు. ప్రమాణస్వీకారానికి హాజరై ఆ తర్వాత జూన్ 10లోగా మరోసారి వైయస్  జగన్ తో భేటీ కానున్నట్లు తెలిపారు. 

యానాంకు సంబంధించి సరిహద్దుల విషయంతోపాటు ఇరు ప్రాంతాల మధ్య సత్సమ సంబంధాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఇకపోతే పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావుకు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డికి మంచి సంబంధాలు ఉండేవి. 

వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే మల్లాడికి విపరీతమైన అభిమానం. వైయస్ మరణానంతరం ఆయన అతిపెద్ద విగ్రహాన్ని యానాంలో ప్రతిష్టించారు మల్లాడి కృష్ణారావు. అంతేకాదు ముమ్మిడివరం నియోజకవర్గంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించేవారు. 

click me!