చంద్రబాబుకు షాక్: వైసీపీలో చేరనున్న టీడీపీ ఎమ్మెల్యే

By Nagaraju penumalaFirst Published May 28, 2019, 8:51 PM IST
Highlights

వైయస్ జగన్ అంగీకరిస్తే తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించినట్లు తెలుస్తోంది. వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తాను తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందడమే కారణమైతే తాను రాజీనామా చేసి మళ్లీ గెలుపొందుతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన తెలుగుదేశం పార్టీకి మరో పెద్ద షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ లో కొట్టుకుపోయి కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ ఎమ్మెల్యే కోలుకోలేని దెబ్బ తియ్యనున్నారని తెలుస్తోంది. 

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో గోడదూకేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యే రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 151 స్థానాల్లో అఖండ విజయం సాధించడంతో వైయస్ జగన్ తో కలిసి పనిచేయాలని ఆశపడుతున్నట్లు నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించనిట్లు ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్ అంగీకరిస్తే తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించినట్లు తెలుస్తోంది. 

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తాను తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందడమే కారణమైతే తాను రాజీనామా చేసి మళ్లీ గెలుపొందుతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానిస్తే ఎమ్మెల్యే పదవిని సైతం తృణపాయంగా వదిలేస్తానని చెప్పుకొచ్చునట్లు సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తోంది. 

అయితే వైయస్ జగన్ రామానాయుడును పార్టీలోకి ఆహ్వానిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. గతంలో వైయస్ జగన్ ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ ప్రజా సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిని జగన్ తమ పదవులను వదిలి రావాలని ఆదేశించారు. 

దాంతో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే వైసీపీలోకి చేరారు. ఈ నేపథ్యంలో రామానాయుడు వైసీపీలోకి వస్తే కచ్చితంగా రాజీనామా చేసి రావాల్సిందేనని ప్రచారం జరుగుతుంది. అయితే నిమ్మల రామానాయుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరతారా లేక సోషల్ మీడియా సృష్టా అన్నది తెలియాల్సి ఉంది.

click me!