హయ్ ల్యాండ్‌పై చంద్రబాబు కన్ను, అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం: మేకతోటి సుచరిత

By narsimha lode  |  First Published Aug 23, 2021, 9:50 PM IST

అగ్రిగోల్డ్ బాధితులకు తాము న్యాయం చేస్తున్నామన్నారు. రేపు రూ. 20 వేలు చెల్లించిన డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లిస్తున్నట్టుగా  ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు.చంద్రబాబునాయుడు  మాత్రం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదన్నారు. పైగా హయ్ ల్యాండ్ పై కన్నేశారని ఆమె విమర్శించారు.


గుంటూరు:అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు న్యాయం చేస్తానని చెప్పి హయ్ ల్యాండ్ మీద కన్నేశారన్నారని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు.

సోమవారం నాడు ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ సంస్థ 32 లక్షల మంది దగ్గర 6500 కోట్లు వసూలు చేసిందన్నారు మంత్రి సుచరిత.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సెబీ పర్మిషన్ లేకుండా అగ్రిగోల్డ్ సంస్థను ప్రారంభించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం లోనే అగ్రిగోల్డ్ కుంభ కోణం బయటపడిందన్నారు.

Latest Videos

రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు  రూ.3500 కోట్లు అగ్రిగోల్డ్ డబ్బులు దోచుకున్నారని ఆమె ఆరోపించారు. .పిల్లల చదువు, పెళ్లి కోసం, ఎక్కువ మంది చిరు వ్యాపారులు అగ్రిగోల్డ్ లో డబ్బులు దాచుకున్నారని  ఆమె చెప్పారు.

దాదాపు 300 మంది ఏజెంట్లు చనిపోయారన్నారు మంత్రి.తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకుంటాం వారి సొమ్ము వారికి తిరిగి ఇస్తామని అని చెప్పామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.

చెప్పినట్టే గత ఏడాది 10 వేల లోపు డిపాజిట్ చేసిన వారందరికీ సొమ్ము చెల్లించిన విషయాన్ని మంత్రొ మేకతోటి సుచరిత గుర్తు చేశారు.
రేపు 20 వేల లోపు ఉన్న వారందరికీ డిపాజిట్లు చెల్లిస్తున్నామన్నారు.అగ్రిగోల్డ్ లాంటి ఘటనలు జరిగితే ఏ ప్రభుత్వం తిరిగి బాధితులకు సొమ్ము చెల్లించిన దాఖలాలు లేవన్నారు. 

ప్రైవేట్ కంపెనీలో డబ్బులు దాచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆమె ప్రజలకు సూచించారు.ఏటి అగ్రహారం లో కానిస్టేబుల్ తమ కుమార్తెతో మాట్లాడుతున్నాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు .

వెంటనే అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నట్టుగా హోంమంత్రి తెలిపారు.కానీ లోకేష్ మాత్రం ఆ యువతి పై అత్యాచారం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆమె మండిపడ్డారు.

 ఇట్లాంటి ప్రచారాల వల్ల బాధితులకు మరింత నష్టం కలిగే అవకాశం ఉంది.బాధితురాలి భవిష్యత్తుకు ఇలాంటి తప్పుడు ప్రచారం మరింత ఇబ్బంది కలిగిస్తుందన్నారు.


 

click me!