ఎన్ని పార్టీలు గుంపులుగా వచ్చినా.. సింహం సింగిల్‌గా, రెడీగా ఉంది: పొత్తులపై టీడీపీ, జనసేనలపై కొడాలి నాని విమ

Published : May 09, 2022, 08:51 PM IST
ఎన్ని పార్టీలు గుంపులుగా వచ్చినా.. సింహం సింగిల్‌గా, రెడీగా ఉంది: పొత్తులపై టీడీపీ, జనసేనలపై కొడాలి   నాని విమ

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు రాజకీయాలపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. టీడీపీ, జనసేనలపై విమర్శలు కురిపించారు. ఎన్ని పార్టీలు గుంపులగా వచ్చినా.. జగన్ సింగిల్‌గా రెడీగా ఉన్నారని అన్నారు. పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌లు ముందు ఎమ్మెల్యేగా గెలవాలని సవాల్ విసిరారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ పునర్వ్యస్థీకరణతో మంత్రి పదవి కోల్పోయిన కొడాలి నాని ఈ రోజు తొలిసారిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పొత్తులపై జరుగుతున్న చర్చపై ఆయన తనదైన శైలిలో టీడీపీ, జనసేనలపై విరుచుకుపడ్డారు. ఎన్ని పార్టీలు గుంపులుగా వచ్చినా వాటిని చెల్లాచెదురు చేయడానికి సింహం రెడీగా ఉన్నదని పేర్కొన్నారు. చంద్రబాబు అబద్ధాల కోరు అని విమర్శించారు. 2019 ఎన్నికల ముందు మహిళలు అంతా తనకే ఓటు వేశారని అన్నారని అన్నారు. ఇప్పుడేమో జగన్‌కు వ్యతిరేకత ఎక్కువ ఉన్నదని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆరోపించారు. అదే నిజమైతే.. ఆయనకు ఇంకో పార్టీ సపోర్ట్ ఎందుకు అవసరం పడుతున్నదని ప్రశ్నించారు.

అటు చంద్రబాబు నాయుడిని, ఇటు పవన్ కళ్యాణ్‌లపై ఆయన విమర్శలు గుప్పించారు. టీడీపీకి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ దొంగచాటుగా పని చేశారని, 2014లో జనసేప పార్టీని స్థాపించింది కూడా చంద్రబాబు కోసమేనని ఆరోపించారు. ఇప్పటి వరకు వారు కలిసే ఉన్నారని, భవిష్యత్‌లోనూ కలిసే ఉంటారని వ్యాఖ్యలు చేశారు. వీరంతా ఎన్ని గుంపులుగా వచ్చినా జగన్ సింగిల్‌గా సింహంలా ఎదుర్కొంటారని వివరించారు. 55 శాతం ఓట్లు జగన్‌కు చెక్కు చెదరకుండా ఉన్నాయని తెలిపారు. మిగిలిన 45 శాతం ఓటింగ్‌లోనే పోటీ పడాలని అన్నారు.

పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ ముందుగా ఎమ్మెల్యేలుగా గెలవాలని వ్యంగ్యం పలికారు. ముందు ఈ వీరి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఈ సారి పుత్రుడు, దత్త పుత్రుడినే కాదు.. చంద్రబాబునే ఓడిస్తామని కొడాలి అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు 2024 ఎన్నికలే చివరివి అని పేర్కొన్నారు. చంద్రబాబుకు అధికారం కావాలని, పవన్ కళ్యాణ్‌కు డబ్బులు కావాలని విమర్శించారు.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో (2024 ap election) 151 సీట్లకు అదనంగా గెలవాలి కానీ.. తక్కువ రావడానికి వీల్లేదని జగన్ దిశానిర్దేశం  చెప్పినట్లు చెప్పారు మాజీ మంత్రి కొడాలి నాని. 2024 ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ఏప్రిల్‌లో సీఎం జగన్  (ys jagan) అధ్యక్షతన తాడేపల్లిలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ భేటీ అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. మే 10 నుంచి ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో పర్యటించాల్సిందిగా ఆదించారని చెప్పారు. 

అలాగే ప్రతి నెలా పది సచివాలయాలు వున్న ఏరియాల్లో ఇంటింటికి వెళ్లాలని సూచించారని కొడాలి నాని వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు.. కుటుంబాలు పొందిన లబ్దిని వివరించాలని మంత్రులు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో ఆర్డినేటర్లను ఆదేశించినట్లు నాని చెప్పారు. 94 శాతం మేనిఫెస్టోను అమలు చేశామన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సీఎం సూచించినట్లు నాని తెలిపారు. మంత్రులు, జిల్లా నేతలతో సమన్వయం చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని జగన్ చెప్పారని పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert: ఇక కాస్కోండి.. తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో అల్ల‌క‌ల్లోల‌మే. భారీ వ‌ర్షాలు.
CM Chandrababu Speech: అవకాశం చూపిస్తే అందిపుచ్చుకునే చొరవ మన బ్లడ్ లోనే వుంది | Asianet News Telugu