జగన్ కీలక నిర్ణయం: అసైన్డ్ భూముల అమ్మకాలు రద్దు, షాక్‌లో కొనుగోలుదారులు

By sivanagaprasad KodatiFirst Published Dec 11, 2019, 9:00 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ భూముల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ భూముల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఏపీ కేబినెట్‌ సమావేశంలో అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారం చర్చకు వచ్చింది.

ఈ సందర్భంగా అసైన్డ్‌ భూముల కొనుగోళ్లను రద్దు చేయడంతో పాటు రిటర్నబుల్ ఫ్లాట్లను కూడా రద్దు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. సీఆర్‌డీఏ పరిధిలో మొత్తం 2,500 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. ఈ భూముల అసలు యజమానులకే ప్రయోజనాలు దక్కుతాయని కేబినెట్ తెలిపింది.

Also read:ముగిసిన ఏపి మంత్రివర్గ సమావేశం... నిర్ణయాలివే

అసైన్డ్ భూముల వ్యవహారంలో గత టీడీపీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు లబ్ధి పొందారని సర్కార్ అనుమానం వ్యక్తం చేస్తోంది. థర్డ్ పార్టీ కొనుగోళ్ల రద్దుతో అక్రమాలకు చెక్ పెట్టే యోచనలో జగన్ ప్రభుత్వం వుంది.

కేబినెట్ నిర్ణయంతో అసైన్డ్ భూముల యాజమాన్య హక్కులను దళిత రైతులు తిరిగి దక్కించుకోనున్నారు. ల్యాండ్ పూలింగ్ లబ్ధి దళిత రైతులకే అందనుంది. అయితే మంత్రివర్గం నిర్ణయంతో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారు ఆందోళనకు గురవుతున్నారు.

కాగా మహిళలు, చిన్నారులపై మృగాళ్ల అకృత్యాలు నానాటికి పెరిగిపోతుండటంతో కేబినెట్ కఠినచట్టం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌ క్రిమిలన్‌ లా - 2019కి లోబడి మహిళలకు ప్రత్యేక రక్షణను ఈ నూతన  చట్టం కల్పించనుంది. దీని ప్రకారం మహిళలు, చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు మరణశిక్షను విధించనున్నారు.

Also read:చంద్రబాబు సభలోనే వుండాలని మనస్పూర్తిగా కోరుకున్నా...కానీ: వైఎస్ జగన్

లైంగిక దాడికి సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నప్పుడు ఆలస్యం చేయకుండా కేవలం 21 రోజుల్లోనే తీర్పు వెలువరించాలని ఈ చట్టంలో పొందుపర్చారు. దీని ప్రకారం వారం రోజుల్లోపు దర్యాప్తు, 14 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, 21 రోజుల్లో తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. 

click me!