అత్యాచారానికి పాల్పడితే మరణిశిక్షే...ఏపి కేబినెట్ సంచలన నిర్ణయం

By Arun Kumar P  |  First Published Dec 11, 2019, 4:45 PM IST

ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలో బుధవారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల మహిళా సంరక్షణపై తీవ్ర జరుగుతన్న నేపథ్యంలో ఏపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళా రక్షణపై సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి  జగన్ నేతృత్వంలో బుధవారం సమావేశమైన మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి ఆమోదం తెలిపింది. 

నూతన చట్టం ప్రకారం మహిళలు, చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే నిందితులుకు మరణిశిక్షను విధించనున్నారు. లైంగిక దాడికి సంబందించిన స్పష్టమైన  ఆదారాలున్నపుడు ఆలస్యం చేయకుండా కేవలం 21 రోజుల్లో తీర్పు వెలువరించాలని ఈ చట్టంలో పొందుపర్చారు. 

Latest Videos

దీని ప్రకారం వారంరోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తిచేసి మొత్తంగా 21 రోజుల్లో జడ్జిమెంట్‌ ఇవ్వాల్సి వుంటుంది. ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తున్నట్లు బిల్లులో పొందుపర్చారు. 

read more  విజయవాడ భవానీ కేసులో ట్విస్ట్: పెంపుడు తల్లి ఫిర్యాదు, డీఎన్ఏ టెస్ట్‌కు ఏర్పాట్లు

మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. మహిళలపై  అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాలకు విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని ఈ చట్టం చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగులు పెడితే చర్యలు తీసుకోనున్నారు. 

సెక్షన్‌ 354 (ఇ) కింద చర్యలు తీసుకునేలా బిల్లులో అంశాలున్నాయి.  మొదటి సారి తప్పు చేస్తే 2 సంవత్సరాలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధించనున్నారు. మెయిల్, సోషల్‌మీడియా, డిజిటిల్‌ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఈ చర్యలు తీసుకుంటారు.

Video news : కన్నతండ్రి ప్రాణం తీసేలా చేసిన ఆస్తితగాదాలు

పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354 (ఎఫ్‌) కింద చర్యలుంటాయి. ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు.  పోస్కోచట్టం కింద ఇప్పటివరకూ 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకూ జైలుశిక్ష వుండగా ఈ శిక్షను పెంచుతూ బిల్లులో అంశాలను కేబినెట్ ఆమోదించింది. 
 

click me!