జగన్ మరో ట్విస్ట్.. శాసన మండలి రద్దు నుంచి కూడా వెనక్కి, అసెంబ్లీలో బుగ్గన తీర్మానం

Siva Kodati |  
Published : Nov 23, 2021, 02:56 PM ISTUpdated : Nov 23, 2021, 03:17 PM IST
జగన్ మరో ట్విస్ట్.. శాసన మండలి రద్దు నుంచి కూడా వెనక్కి, అసెంబ్లీలో బుగ్గన తీర్మానం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ap govt) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లులను (ap three capitals)  వెనక్కి తీసుకున్న జగన్ సర్కార్ (jagan) .. తాజాగా శాసనమండలి రద్దు (ap legislative council ) చేయాలంటూ గతంలో చేసిన తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ap govt) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లులను (ap three capitals)  వెనక్కి తీసుకున్న జగన్ సర్కార్ (jagan) .. తాజాగా శాసనమండలి రద్దు (ap legislative council ) చేయాలంటూ గతంలో చేసిన తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy ) మంగళవారం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.  కేంద్రం నుంచి నిర్ణయం రాకపోవడంతో శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు బుగ్గన వెల్లడించారు. మండలి రద్దు తర్వాత ఒక సందిగ్థత వుండిపోయిందని బుగ్గన అన్నారు. ఈ సందిగ్థతను తొలగించేందుకు మండలిని కొనసాగించాలని సీఎం నిర్ణయించారని ఆయన తెలిపారు. 

జనవరి 27, 2020న శాసన మండలిని రద్దు చేయాల్సిందిగా ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం దానిని కేంద్రానికి పంపింది. అయితే దాదాపు 22 నెలలుగా కేంద్రం వద్దే ఈ తీర్మానం వుండిపోవడం.. ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో జగన్ ప్రభుత్వం కౌన్సిల్ రద్దు నుంచి వెనక్కి తగ్గింది. 

ALso Read:శాసనమండలికి మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు: ప్రవేశ పెట్టిన ఏపీ మంత్రి బుగ్గన

కాగా.. మూడు రాజధానుల బిల్లులు వెనక్కి తీసుకోవడంపై అసెంబ్లీలో (ap assembly) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. విస్తృత, విశాల ప్రయోజనాలు కాపాడేందుకే బిల్లును వెనక్కి తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు  ఆమోదించిన వెంటనే ప్రక్రియ ప్రారంభమై వుంటే మంచి ఫలితాలు వచ్చి వుండేవని జగన్ అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ బిల్లు పెట్టామని సీఎం స్పష్టం చేశారు. 3 రాజధానులపై మరింత మెరుగైన బిల్లు తీసుకొస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. రాజధాని చట్టాల ఉపసంహరణ తాత్కాలికమేనని ఆయన చెప్పారు. 

అమరావతిలో రాజధాని, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు లక్షల కోట్లు ఖర్చవుతుందని సీఎం అన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే రాజధాని ఊహా చిత్రం ఎలా సాధ్యమవుతుందని జగన్ ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం సమంజసమేనా? మనకు, మన పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? పిల్లలందరూ పెద్ద నగరాలైన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సిందేనా అని ఆయన నిలదీశారు. ప్రస్తుతంలో ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం విశాఖ అని.. అక్కడ అన్నీ వసతులు ఉన్నాయని జగన్ చెప్పారు. వాటికి అదనపు హంగులు దిద్దితే, ఐదారేళ్ల తర్వాత అయినా హైదరాబాద్‌ వంటి నగరాలతో పోటీ పడే అవకాశం ఉంది అని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. 

PREV
click me!

Recommended Stories

మాస్క్ అడిగితె చంపేస్తారా? Varla Ramaiah Serious Comments on YS Jagan | Viral | Asianet News Telugu
Huge Job Scam: సీఎంపీషీ పేరుతో భారీ మోసం.. రూ.12 లక్షలు దోచుకున్న ముఠా అరెస్ట్ | Asianet News Telugu