సామాన్యుడిని టమాట రేట్లు (tamoto price) హడలగొడుతున్నాయి. వాటిని కొనాలంటేనే సామాన్యులు జంకుతున్నారు. దీంతో చాలా మంది వంటల్లో టమాట కోటాను తగ్గించేశారు. హోటళ్లలోనూ కోతలు పెట్టేస్తున్నారు. అవసరమై కొనాలి అనుకుంటే ఎక్స్ ట్రా బిల్లులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కిలో టమాట గరిష్ఠంగా రూ.130 పలుకుతోంది
సామాన్యుడిని టమాట రేట్లు (tamoto price) హడలగొడుతున్నాయి. వాటిని కొనాలంటేనే సామాన్యులు జంకుతున్నారు. దీంతో చాలా మంది వంటల్లో టమాట కోటాను తగ్గించేశారు. హోటళ్లలోనూ కోతలు పెట్టేస్తున్నారు. అవసరమై కొనాలి అనుకుంటే ఎక్స్ ట్రా బిల్లులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కిలో టమాట గరిష్ఠంగా రూ.130 పలుకుతోంది. పావు కిలో టమాటలను కొనేబదులు.. అదే రేటుకు రెండు మూడు రకాల ఆకు కూరలు కొంటున్నారని కూరగాయల వ్యాపారులు అంటున్నారు. రెండు నెలల క్రితం వరకు కిలో టమాట రూ.10 ఉండగా.. ఇప్పుడు ఏకంగా 10 రెట్లు పెరిగి సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. భారీ వర్షాలతో పంట నష్టపోవడంతో పాటు వున్న పంటను రవాణా చేసేందుకు మార్గాలు లేకపోవడం వంటి కారణాలతో టమాట మార్కెట్ రాక తగ్గిపోయింది. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయి. ఇటు ఇతర కూరగాయల ధరలూ బాగా పెరిగాయి.
ఏపిలోని అతి పెద్ద టమోటా మార్కెట్ కేంద్రం చిత్తూరు జిల్లా (chittoor district) మదనపల్లిలో (madanapalle) గత వారం రోజుల నుంచి టమోటా ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకి మరింత పైకి చేరి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలతో పాటు కర్నాటకలో కురిసిన భారీ వర్షాల (heavy rains) కారణంగా అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలు, వరదలతో టమోటా పంట భారీగా దెబ్బతింది. దీంతో దిగుబడి అనుహ్యాంగా పడిపోవడంతో మార్కెట్ లో టమోటాకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితులలో మార్కెట్ కు వస్తున్న టమోటాల ధర అధికంగా పలుకుతుంది. మంగళవారం మదనపల్లి టమోటా మార్కెట్ లో 28 కేజీల క్రేట్ టమోటా ధర రూ.3500లు పలికింది. దీంతో హోల్ సేల్ గానే కిలో టమోటా ధర రూ.125లు గా ఉంటే వినియోగదారుడికి చేరే సరికి ఎంత ధర పలుకుతోందో అర్థం కావడం లేదు.
undefined
ALso Read:సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న టమాటా.. కొండెక్కిన ధరలు, కేజీ ఎంతో తెలుసా..?
మదనపల్లి మార్కెట్ లో నెలకొన్న టమోటాల కొరతను నివారించడానికి మార్కెట్ యార్డులోని పలువురు మండీ యజమానులు ఇతర రాష్ట్రాల నుంచి రోజుకు రెండు, మూడు లారీల సరకు దిగుమతి చేస్తున్నప్పుటికి వ్యాపారులకు సరిపోవడం లేదు. మంగళవారం ఉదయం చత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన మూడు లారీల టమోటాలు కేవలం రెండు గంటలలోనే అమ్ముడుపోయాయంటే పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు.