మూడు రాజధానుల చట్టం రద్దు: ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ అఫిడవిట్

By narsimha lodeFirst Published Nov 26, 2021, 2:36 PM IST
Highlights

మూడు రాజధానుల చట్టాన్ని ఈ నెల 22న ఉపసంహరించుకొన్నట్టుగా ఏపీ హైకోర్టుకు జగన్ సర్కార్ శుక్రవారం నాడు అఫిడవిట్ అందించింది.

 

 అమరావతి:  మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకొన్నట్టుగా ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానుల చట్టాన్ని ఈ నెల 22న ఉపసంహరించుకొన్నట్టుగా  ఏపీ ప్రభుత్వం తెలిపింది.  ఈ మేరకు ఏపీ అసెంబ్లీలో ఈ బిల్లును ఆమోదించిన విషయాన్ని కూడా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మ AP High court అఫిడవిట్ ఇచ్చారు. Three capitals చట్టం ఉపసంహరణ గురించి కూడా వివరించారు. ఈ నెల 23న AP legislative Council లో కూడా  ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయాన్ని  కూడా అఫిడవిట్ లో ప్రభుత్వం వివరించింది.వికేంద్రీకరణ చట్టం రద్దు బిల్లును చట్టసభల్లో ఆమోదించినందున తగు ఉత్తర్వులు ఇవ్వాలని ఆ ఆఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం కోరింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ది బిల్లు-2020 , ఏపీ సీఆర్‌డీఏ రద్దు -2020 బిల్లులకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్  2020 జూలై 31న ఆమోదం తెలిపారు. శాసనమండలికి రెండు దఫాలు పంపిన తర్వాత నెల రోజుల గడువు పూర్తైతే అలాంటి బిల్లులు ఆమోదం పొందినట్టే పరిగణించాల్సి ఉంటుందంటూ ప్రభుత్వం ఇటీవల ఈ మూడు బిల్లులను ఆమోదానికి పంపింది. దీంతో గవర్నర్  ఈ మూడు బిల్లులకు ఆమోదం తెలిపారు.

also read:సీఆర్‌డీఏ రద్దు ఉపసంహరణ.. మంగళగిరి తాడేపల్లి కార్పోరేషన్‌‌కు సంబంధం లేదు: ఆర్కే

అయితే మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు పాదయాత్ర కొనసాగిస్తున్నారు.  45 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర సాగుతుంది. నిన్న బీజేపీకి చెందిన నెల్లూరు జిల్లాలో ఈ పాదయాత్రలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. నెల్లూరు జిల్లాలో బీజేపీ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొని తమ సంఘీభావం తెలిపిన మరునాడేఏపీ సర్కార్ ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ నెల 22న నిర్వహించిన కేబినెట్ అత్యవసర సమావేశంలో ఏపీ  ప్రభుత్వం మూడు రాజధానులపై చేసిన చట్టాలను వెనక్కి తీసుకొంది. 


మూడు రాజధానుల చట్టానికి న్యాయ పరమైన చిక్కులు ఎదురు కాకుండా ఉండేందుకు గాను జగన్ సర్కార్ ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. న్యాయ పరమైన చిక్కులు ఎదురు కాకుండా సమగ్రంగా కొత్త బిల్లును ఏపీ అసెంబ్లీ ముందుకు త్వరలోనే జగన్ సర్కార్ తీసుకు రానుంది. అంతేకాదు ఈ బిల్లులోనే  ప్రజల సందేహలకు సమాధానాలు కూడా ఇస్తామని అసెంబ్లీ వేదికగా జగన్ ప్రకటించారు. ఈ బిల్లును ప్రవేశ పెట్టడానికి ముందే ప్రజల నుండి విస్తృతంగా అభిప్రాయాలను సేకరిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ప్రక్రియ ఎప్పటి నుండి ప్రారంభిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొత్త బిల్లు అసెంబ్లీ, మండలిలో సులభంగా పాస్ కానుంది. ఈ రెండు సభల్లో వైసీపీకి బలం ఉంది. అసెంబ్లీలో, శాసనమండలిలో వైసీపీకి బలం ఉంది. గతంలో శాసనమండలిలో  టీడీపీకి బలం ఉంది. కానీ డిసెంబర్ 10 తర్వాత ఏపీ శాసన మండలిలో వైసీపీ బలం పెరగనుంది. దీంతో ఈ బిల్లు సులభంగా ఉభయ సభల్లో పాస్ కానుంది.

click me!