కరోనా ఎఫెక్ట్: బ్లడ్ డొనేషన్‌ క్యాంపులపై నిషేధం.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

By Siva KodatiFirst Published Apr 14, 2020, 7:21 PM IST
Highlights
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్  కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కోవిడ్ 19ను నియంత్రించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ సందర్భంగా రక్తదాన కార్యక్రమాలన్నీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్  కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కోవిడ్ 19ను నియంత్రించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ సందర్భంగా రక్తదాన కార్యక్రమాలన్నీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. రక్తదాన క్యాంపుల ద్వారా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది.

రాష్ట్రంలోని స్వచ్ఛంద, సేవా సంస్థలు నిర్వహించచే రక్తదాన కార్యక్రమాల్లో ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉంది. లాంటి సమూహాల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి పెరగొచ్చని సర్కార్ అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్ ముగిసే వరకు రక్తదాన కార్యక్రమాలపై నిషేధం విధించింది. అయితే ప్రతిరోజూ రక్తమార్పిడి అవసరమైన తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగుల అవసరాలు, వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మినహాయింపులు కల్పించింది.

రోగుల రక్త మార్పిడి, చికిత్స కోసం సంబంధిత ఆసుపత్రికి వెళ్లేందుకు ఆ సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డులను పరిశీలించి అనుమతులు ఇచ్చే అధికారాన్ని అధికారులకు ఇచ్చింది. పైన తెలిపిన వ్యాధిగ్రస్తులు ప్రయాణ అనుమతి కోసం రక్త మార్పిడి అవసరం ఉందని తెలిపే ఆధారాలు పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది.

వాటిని పరిశీలించిన మీదట పోలీసు అధికారులు పాసులను మంజూరు చేస్తారు. మరోవైపు ఏపీలో గత 16 గంటల్లో 34 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 473కి చేరింది. 109 కేసులతో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 
click me!