వైఎస్ఆర్ బాటలోనే జగన్, షర్మిల కూడ

First Published 12, Jun 2018, 7:12 PM IST
Highlights

ఆ ముగ్గురిది అదే దారి

రాజమండ్రి: ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, షర్మిల నడిచిన దారిలోనే అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి ద్వారా రాజమండ్రిలోకి ప్రవేశించారు. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి  రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి ద్వారా  రాజమండ్రిలోకి ప్రవేశించారు.

ఆ సమయంలో వైఎస్ఆర్ తో కలిసి జనం బ్రిడ్జి వెంట పాదయాత్ర సాగించారు.ఆ సమయంలోనే  వైఎస్ఆర్ పాదయాత్రతో వందలాది మంది పాల్గొనడం అప్పట్లో సంచలనంగా మారింది. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి  పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అపూర్వరీతిలో స్వాగతం పలికారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 

2013లో వైఎస్ షర్మిల కూడ పాదయాత్ర నిర్వహించారు.  వైఎస్ఆర్ ఆనాడు చేసిన పాదయాత్రను గుర్తు చేస్తూ వైఎస్ షర్మిల 2013 జూన్ 4న పశ్చిమగోదావరి నుండి తూర్పుగోదావరి జిల్లాలోకి రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెన మీదుగా యాత్ర సాగింది. వైఎస్ఆర్ బతికున్న కాలంలో ఆనాడు జక్కంపూడి రామ్మోహన్ రావు నేతృత్వంలో  వైఎస్ఆర్ కు స్వాగతం పలుకుతూ భారీగా  ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.


ఇవాళ పశ్చిమగోదావరి నుండి తూర్పుగోదావరి జిల్లాలోకి రాజమండ్రి రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి మీదుగా వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. 
 జగన్ పాదయాత్ర సాగుతున్న  వేళ కింద గోదావరిలో వైకాపా జెండాలతో అలంకరించబడిన 600 పడవలు ఆయన్ను అనుసరించే ఏర్పాటు చేశారు. బ్రిడ్జి రెయిలింగ్ పై 7 అడుగుల ఎత్తు, 3.5 కిలోమీటర్ల పొడవైన వైకాపా జెండా ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది.

"

Last Updated 12, Jun 2018, 7:12 PM IST