వట్టికి లైన్ క్లియర్ చేసిన జగన్ : చేరిక లాంఛనమే

By Nagaraju TFirst Published Dec 27, 2018, 4:19 PM IST
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ వైసీపీలోకి చేరనున్నారా..?బెర్త్ కన్ఫమ్ కాకపోవడమే పార్టీలో చేరికకు ఆలస్యం అయ్యిందా..?నియోజకవర్గం క్లియర్ చేసే పనిలో వైసీపీ పడిందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వైసీపీలోకి వట్టి వసంతకుమార్ చేరిక ఇక లాంఛనమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 
 

తాడేపల్లి గూడెం: కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ వైసీపీలోకి చేరనున్నారా..?బెర్త్ కన్ఫమ్ కాకపోవడమే పార్టీలో చేరికకు ఆలస్యం అయ్యిందా..?నియోజకవర్గం క్లియర్ చేసే పనిలో వైసీపీ పడిందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వైసీపీలోకి వట్టి వసంతకుమార్ చేరిక ఇక లాంఛనమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇన్నాళ్లు పార్టీ అధినేత వైఎస్ జగన్ వట్టి వసంతకుమార్ టిక్కెట్ పై ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో ఆయన స్థబ్ధుగా ఉన్నారు. అయితే వైఎస్ జగన్ వట్టి వసంతకుమార్ కు టిక్కెట్ కన్ఫమ్ చెయ్యాలని ఆదేశించడంతో ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. 

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రస్తుత సమన్వయ కర్త కొట్టు సత్యనారాయణకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని సర్వే నివేదికలో తేటతెల్లమవ్వడంతో జగన్ అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తాడేపల్లి నియోజకవర్గాన్ని వట్టి వసంతకుమార్ కు కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఈ టిక్కెట్ పై ప్రస్తుత నియోజకవర్గ ఇంచార్జ్ కొట్టు సత్యనారాయణతోపాటు వలవల బాబ్జీ కూడా ఆశిస్తున్నారు. అయితే ఇద్దరినీ కాదని వైఎస్ జగన్ వట్టి వసంతకుమార్ వైపే మెుగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఉభయగోదావరి జిల్లాల ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ, సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి మాత్రం కొట్టు సత్యనారాయణ వైపే మెుగ్గు చూపుతున్నారు. 

మెుదటి నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ముగ్గురు సమన్వయ కర్తలను మార్చింది. తొలుతు తోట గోపిని నియోకవర్గ సమన్వయ కర్తగా నియమించారు. 

ఆ తర్వాత ఆయన్ను కాదని వలవల బాబ్జీని సమన్వయకర్తగా ప్రకటించారు. ఆయన తర్వాత కొట్టు సత్యనారాయణను సమన్వయ కర్తగా ఎంపిక చేశారు. తాజాగా వట్టి వసంతకుమార్ ను ఎంపిక చేసే ఆలోచనలో పడినట్లు తెలిసింది. 

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇక మార్పులు చేర్పులు ఉండకూడదనే లక్ష్యంతో వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. అందులో భాగంగా గెలుపుగుర్రాల అన్వేషణలో పడింది. అయితే ఆ గెలుపు గుర్రం వట్టి వసంత్‌కుమార్‌ అని నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది.  

గతంలో వట్టి వసంత్ కుమార్ నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చెయ్యాలని భావించారు. అందుకు వైఎస్ జగన్ అంగీకరించకపోవడంతో ఆయన వైసీపీ వైపు చూడటం మానేశారు. తాజాగా తాడేపల్లిగూడెం బరిలో నిలపాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకు తగ్గట్లు వ్యూహరచన చేస్తోంది. 

ఇప్పటికే వైసీపీ దూతగా చెప్పుకునే అనిల్ రెడ్డి రంగంలోకి దిగారు. వట్టి వసంతకుమార్ ను పార్టీలో తీసుకువచ్చే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే అప్పట్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడిగా మెలిగిన ఐఏఎస్‌ అధికారి భానుమూర్తి కూడా తాడేపల్లిగూడెం నుంచి పోటీ చెయ్యాలని భావించారు. 

ఆ తర్వాత సినీనటుడు పృథ్వీరాజ్‌ కూడా తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా వట్టి వసంతకుమార్ పేరు తెరపైకి వచ్చింది. మాజీమంత్రిగా జిల్లా రాజకీయాల్లో మంచి పట్టున్న వట్టి వసంతకుమార్ బరిలో నిలిస్తే గెలిచే అవకాశం ఉంటుందని వైసీపీ భావిస్తోంది. మరి ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీలోకి వట్టి వసంత్ కుమార్..?

చంద్రబాబుతో రాహుల్ భేటీ ఎఫెక్ట్: కాంగ్రెసుకు వట్టి రాజీనామా

click me!