జగన్ పై దాడి కేసు: ఎన్ఐఏ కస్టడీకి నిందితుడు శ్రీనివాస్

Published : Jan 11, 2019, 05:54 PM IST
జగన్ పై దాడి కేసు: ఎన్ఐఏ కస్టడీకి నిందితుడు శ్రీనివాస్

సారాంశం

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. నిందితుడు శ్రీనివాస్ ను వారం రోజులపాటు కస్టడీకీ అప్పగిస్తూ ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

విజయవాడ: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. నిందితుడు శ్రీనివాస్ ను వారం రోజులపాటు కస్టడీకీ అప్పగిస్తూ ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

అయితే కేసు విచారణలో పలు సూచనలు చేసింది. విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని ఎన్ఐ కోర్టు ఆదేశించింది. విచారణలో భాగంగా ప్రతీ 3రోజులకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. నిందితుడు కోరితే న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిపించాలని ఆదేశించింది. 

ఇకపోతే ఉదయం ఎన్ఐఏ కోర్టులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు హాజరుపరిచారు. ఎన్ఐఏ కోర్టులో వాదనలు అనంతరం కేసు విచారణ 25కు వాయిదా వేసింది. అయితే ఎన్ఐఏ శ్రీనివాసరావు కస్టడీపై కేసును పెండింగ్ లో పెట్టింది. 

ఈ నేపథ్యంలో తాజాగా శ్రీనివాసరావును కస్టడీకి అనుమతినిస్తూ ఎన్ఐఏ కోర్టు అనుమతినిచ్చింది. నిందితుడు శ్రీనివాసరావును విజయవాడ సబ్ జైలుకు తరలించాలని ఆదేశించింది. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే