అమీన్‌పీర్ దర్గాలో జగన్ ప్రత్యేక ప్రార్థనలు

Published : Jan 11, 2019, 05:40 PM IST
అమీన్‌పీర్ దర్గాలో  జగన్ ప్రత్యేక ప్రార్థనలు

సారాంశం

పాదయాత్ర ముగించుకొని స్వంత జిల్లాకు వచ్చిన వైసీపీ చీఫ్  వైఎస్ జగన్‌‌కు కడప జిల్లాలో ఘన స్వాగతం లభించింది.


కడప:పాదయాత్ర ముగించుకొని స్వంత జిల్లాకు వచ్చిన వైసీపీ చీఫ్  వైఎస్ జగన్‌‌కు కడప జిల్లాలో ఘన స్వాగతం లభించింది.

కడప జిల్లాలో వైఎస్ జగన్ కాన్వాయ్ ప్రవేశించగానే ఆ పార్టీ అభిమానులు, ఆ పార్టీ నేతలు జగన్‌తో పాటు ర్యాలీ నిర్వహించారు.కడప జిల్లాలోని అమీన్ పీర్ దర్గాను  జగన్ శుక్రవారం నాడు సందర్శించుకొన్నారు. దర్గా వద్ద జగన్ మొక్కులు చెల్లించుకొన్నారు. అంతేకాదు చాదర్‌‌ను కప్పారు.

అనంతరం ఉద్యానవనశాఖ విద్యార్థులతో జగన్ సమావేశమయ్యారు. కొన్ని రోజులుగా ఉద్యానవనశాఖ విద్యార్థులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సెక్రటేరియట్లను ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆరు మాసాల్లోపుగా ఈ గ్రామ సెక్రటేరియట్లను అమల్లోకి తీసుకొస్తామన్నారు.

గ్రామ సెక్రటేరియట్లలో  టెక్నికల్ సిబ్బందిని నియమిస్తామని జగన్ హామీ ఇచ్చారు. వ్యవసాయం ఎలా చేయాలనే విషయమై టెక్నికల్ సిబ్బంది సూచనలు, సలహలు ఇస్తారని చెప్పారు. ఒకే గ్రామంలో ఎక్కువ మంది అర్హులుంటే పక్క గ్రామాల్లో  వారి సేవలను ఉపయోగిస్తామని జగన్ హామీ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

Legendary Actor Krishnam Raju 86th Birth Anniversary | Free Mega Diabetes Camp | Asianet News Telugu
Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుప‌తి ప‌రిస‌ర ప్రాంతాల సంద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలు