జూన్ 8న జగన్ కేబినెట్: 15 మందికి ఛాన్స్

By Siva KodatiFirst Published May 31, 2019, 11:14 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం జూన్ 8న కొలువు దీరనుంది. కేబినెట్‌లో 15 మందికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. జూన్ 11 తర్వాత మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో జగన్ పాలనను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం డీజీపీతో పాటు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలోని శాంతి భద్రతలు, తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే అధికార యంత్రాంగంలో సమూల మార్పులు చేపట్టారు వైఎస్ జగన్.. సీఎంవోలోని కీలక అధికారులపై వేటు వేసిన సీఎం, డీజీపీ ఠాకూర్, ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరావును బదిలీ చేశారు. శనివారం లోగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సైతం స్థాన చలనం ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

click me!