పవన్ కల్యాణ్ మీద వైఎస్ జగన్ అంచనా ఇదీ...

By pratap reddyFirst Published Jan 7, 2019, 1:12 PM IST
Highlights

పవన్‌ కళ్యాణ్‌ మీతో వస్తాడంట అని అడగటం కూడా ధర్మం కాదని, ఎందుకంటే పవన్‌కళ్యాణ్‌ తనతో  ఎప్పుడూ మాట్లాడింది లేదని, తాను ఆయనతో మాట్లాడింది లేని. తాను ఆయన్ను చూసింది కూడా లేదని, ఆయన తనను చూసింది లేదని జగన్ చెప్పారు.

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అంచనాను పంచుకున్నారు. ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నిర్వహించే పాత్రపై ఆయన మాట్లాడారు. 

పవన్‌ కళ్యాణ్‌ అనే వ్యక్తి ఇండిపెండెంట్‌గా పోటీ చేశాడే అనుకో.. ఏమౌతుందని ఆయన అడిగారు. గత ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ పోటీ చేశారని, చంద్రబాబుకు ఓటెయ్యండని ఊరూరా తిరిగారని, ఇదే పవన్‌ కళ్యాణ్‌ అనే వ్యక్తి అంతగా తిరిగినందువల్ల ఆయన్ను ప్రేమించే ప్రతి ఒక్కరూ చంద్రబాబుకే ఓటు వేశారని ఆయన వివరించారు. 

ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ సపరేట్‌గా పోటీ చేస్తున్నాడంటే ఏం జరుగుతుందని అని ప్రశ్నిస్తూ ఆ రోజు పవన్‌ కళ్యాణ్‌ను అభిమానించే వ్యక్తులే బహుశా పవన్‌ కళ్యాణ్‌కు మళ్లీ ఓటు వేసుకుంటారేమో.. అందులో కూడా బహుశా అందరూ వేయరేమో.. మెజార్టీ వాళ్లు వేస్తారేమో అని ఆయన అన్నారు. అప్పుడు ఓటు బ్యాంకు ఎవరిది తగ్గుతుందని ప్రశ్నిలస్తూ తగ్గేది చంద్రబాబు ఓటు బ్యాంకే తగ్గుతుందని అన్నారు.

పవన్ కల్యాణ్ జనసేన ఒంటరి పోటీ చేస్తే తమ ఓటు బ్యాంకు తగ్గే పరిస్థితి ఉండదని చెప్పారు. పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేస్తే ఏమి జరుగుతుందనే విషయంపై మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరికి వస్తుందని ప్రశ్నించారు. ఆ ఓటు తమ పార్టీకే పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఓటరు దగ్గర ఉన్న ఛాయిస్‌లు రెండే రెండు అని, అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు పాలన మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ స్థాయిలో వ్యతిరేక ఓటు ఉందంటే.. చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బిహేవ్‌ చేసినా అట్లానే బిహేవ్‌ చేస్తారని అన్నారు. 

1994లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినప్పుడు 294 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి వచ్చింది 26 స్థానాలు మాత్రమేనని, అంటే లెస్‌ ద్యాన్‌ 10 పర్సెంట్‌.ృ అని, అదే రకంగా 2004లో టీడీపీ ఓడిపోయినప్పుడు టీడీపీకి వచ్చిన స్థానాలు 47. అంటే లెస్‌ ద్యాన్‌ 15 పర్సెంట్‌ అని, ఉన్న స్థానాలకు 15 పర్సెంట్‌ స్థానాలు కూడా రాలేదని ఆయన విశ్లేషించారు.


వచ్చే ఎన్నికల్లో పోటీ చంద్రబాబుకు తనకూ మధ్యే ఉంటుందని అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ గురించి చంద్రబాబే ఈ మధ్య స్టేట్‌మెంట్‌ ఇచ్చారని, తెలంగాణలో తాను పోటీ చేస్తానన్నప్పుడు తెలంగాణలో జనసేన మద్దతు ఇచ్చిందని ఆయనంతకు ఆయనే ఓపెన్‌ డయాస్‌లో చెప్పుకున్నాడని అన్నారు. ఈ మధ్య కాలంలోనే స్టేట్‌ మెంట్‌ ఇచ్చాడని, తాను, పవన్‌ కలుస్తానంటే జగన్‌కు అంత బాధ ఎందుకని చంద్రబాబు నాయుడు అన్నారని ఆయన గుర్తు చేశారు. 


చూస్తా ఉంటే ఇంతకుముందు కలిసి పోటీ చేసి ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు విడిపోయినట్టుగా నటించి మోసం చేసే కార్యక్రమం జరుగుతోందని, ఇప్పుడు ఆ నటన కూడా కాస్తా పక్కన పెట్టేసి ముసుగు తీసేసి మళ్లీ ఒక్కటయ్యే పరిస్థితి కన్పిస్తున్నట్టుగా చంద్రబాబు మాటలను బట్టి చూస్తే అర్థం అవుతోందని అన్నారు. పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేస్తే ఇంకా నేను సంతోష పడతానని చెప్పారు. 

పవన్‌ కళ్యాణ్‌ మీతో వస్తాడంట అని అడగటం కూడా ధర్మం కాదని, ఎందుకంటే పవన్‌కళ్యాణ్‌ తనతో  ఎప్పుడూ మాట్లాడింది లేదని, తాను ఆయనతో మాట్లాడింది లేని. తాను ఆయన్ను చూసింది కూడా లేదని, ఆయన తనను చూసింది లేదని జగన్ చెప్పారు.

click me!